పవన్ ని తొక్కి పెట్టారు

చిరంజీవి కేవలం ఒక బొమ్మ. ఆయనేం చేయాలో, ఏ సినిమాకు సైన్ చేయాలో, ఏ సినిమా చూడాలో కూడా చెప్పే అల్లు అరవింద్ చిరంజీవి కుటుంబాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. 'అని నట్టికుమార్ ఘాటుగా విమర్శించారు. అలాగే ఈ ఎన్నికల్లో ఫ్యాన్స్ కు ఎన్ని టిక్కెట్లు ఇచ్చారో చెప్పే అరవింద్ కి ధైర్యం ఉందా? ఉంటే అనకాపల్లిలో మీడియా ముందుకొచ్చి చెప్పే దమ్ముందా? సినిమాల్లో కాపు నిర్మాతకేమైనా చేశారా? నేనూ కాపునే! జూనియర్ ఎన్టీఆర్ తన నిర్మాత నష్టపోతే మళ్లీ సినిమాలిస్తున్నాడు. అంత పెద్ద మనసు వీళ్లకుందా? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
మేమంతా ఓసారి సారథి స్టుడియోలో ముఠామేస్త్రీ షూటింగులో ఉన్నాం. అప్పుడు చిరంజీవి తాను ఇక్కడ షూటింగ్ చేయనని, చెన్నైలో మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. దీనికి ఆ సమయంలో ఆ సినిమాలో నటిస్తున్న శ్రీహరి, నిర్మాత కె.సి. శేఖర్‌బాబు సాక్ష్యం. చివరకు వీళ్ల ఇన్‌కంటాక్‌స లెక్కలు కూడా చెన్నైలోనే ఉన్నాయి. అంటే వీళ్లకు రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది అన్నారు.


Click it and Unblock the Notifications











