రాజశేఖర్ తో సినిమా చేస్తావా అని భయపెట్టారు
'నేను డా.రాజశేఖర్‌తో సినిమా తీస్తున్నానని చెప్పగానే అందరూ భయపెట్టారు. ఆయన షూటింగ్‌కి సమయానికి రాడని, అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేసి విడుదల చేయలేవని అన్నారు అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత నట్టికుమార్. విశాఖ టాకీస్ బేనరుపై డా.రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ' మా అన్నయ్య బంగారం' చిత్రం షూటింగ్ స్పాట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 27న ఈ సినిమా విడుదల చేస్తానని చెప్పినప్పుడు నవ్విన వాళ్లు కూడా ఉన్నారు. అయితే నేను రాజశేఖర్‌తో ' మా అన్నయ్య బంగారం' చిత్రం షూటింగ్ ప్రారంభించి ఇప్పటికి 27 రోజులయింది. ఏ రోజూ మా హీరో నన్ను ఇబ్బంది పెట్టలేదు సరికదా నేను చెప్పిన సమయానికి షూటింగ్‌కు వచ్చి ఎంతో సహకరిస్తున్నారు. రాజశేఖర్ తో పాటు యూనిట్ సభ్యులందరూ కోపరేట్ చేస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ చాలా హ్యాపీగా సాగిపోతోంది' అన్నారు నట్టి కుమార్.


Click it and Unblock the Notifications











