twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేష్ బాబు రౌడీయిజం..

    By Staff
    |

    Suresh babu
    వ్యాపారం చేస్తున్నామంటూ సినిమా రంగంపై గుత్తాధిపత్యం చేస్తూ సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు వంటి వారు వారికి అనుకూలంగా లేని వారిపై రౌడీయిజం చేస్తున్నార తెలుగు చలన చిత్ర పరిరక్షణ సంఘం విమర్శలు చేసింది. అలాగే కొంతమంది సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు లకి వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి వారిని చిత్రరంగం నుంచి బహిష్కరించాలి అన్నారు.

    సుమంత్‌ నటించిన 'బోణి" చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తున్న సరస్వతి ఫిలింస్‌ ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నట్టికుమార్‌తోపాటు, నిర్మాతలు సంగిశెట్టి దశరధ, సాయివెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. నట్టికుమార్‌ మాట్లాడుతూ సురేష్‌ మూవీస్‌ సురేష్‌బాబు, ఏషియన్‌ ఫిలింస్‌ సునీల్‌ పరిశ్రమలో మాఫియా డాన్స్‌లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ధియేటర్ల గుత్తాధిపత్యం తొలగిపోనంతవరకూ ఈ సమస్య పరిష్కారం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

    ఇలాంటి విషయాలపై ప్రశ్నించినందుకు ఈ తరహా దాడి నాపై కూడా గతంలో జరిగింది. ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిని, ప్రోత్సహిస్తున్న వారిని అరెస్టు చేయాలి. అలాగే వీరు 172 కోట్లు సర్వీస్‌ టాక్స్‌ ఎగవేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ విషయమై మేము హోం మంత్రిని, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, చిరంజీవిని, పరిశ్రమ పెద్ద దాసరి నారాయణరావును కలసి పరిస్థితిని వివరించనున్నాం.

    థియేటర్లపై గుత్తాధిపత్యం చేస్తున్న వారు వాటిని వదలకపోతే సినిమా నిర్మాణాన్ని ఆపాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం' అన్నారు. సంగిశెట్టి దశరథ, కూనిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, డబ్బు కోసం మంచి పద్ధతులను కాలరాయడం మంచిది కాదని, చిన్న నిర్మాతలను ఆదుకోవడానికి సినిమా పెద్దలు పెద్ద మనసు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X