సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా: నాని

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా అంత ఈజీగా సక్సెస్ కాలేదు. వారసులైనా సపోర్ట్ తో వచ్చినా కొత్త వారైనా కూడా కష్టపడి వర్క్ చేయాల్సిందే. ఫైనల్ గా ఆడియెన్స్ ని మెప్పిస్తేనే ఎవరికైనా సరే ఒక లైఫ్ ఉంటుంది. ఇక ప్రయత్నాల్లో కొన్ని అవమానాలు తప్పవు. అలాంటి పరిస్థితులను హీరో నాని కూడా ఎదుర్కొన్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యువ హీరో కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లడించాడు.

ఆ సినిమా తరువాత..

ఆ సినిమా తరువాత..

నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న నాని దర్శకుడు అవ్వాలని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కానీ ఊహించని విధంగా అష్టా చమ్మా సినిమాతో అతనిని అదృష్టం వరించింది. ఆ సినిమా తరువాత నాని వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకుంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకునే రేంజ్ కి ఎదిగాడు.

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా..

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా..

ఇక సినిమా ఇండస్ట్రీలో తాను కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఆ విషయం గురించి మాట్లాడుతూ.. అవమానాలు అనేవి ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. వాటిని లెక్క చేయకుండా ఒక ప్రాసెస్ లా తీసుకోవాలి. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోకపోతే కొంచెమైనా కిక్ ఉండదు కదా.. అలవే ఏది కూడా అంత ఈజీగా రాదు. అలా రాకూడదు కూడా. కష్టపడాల్సిందే.

Recommended Video

Hero Sudheer Babu Special Interview On 'V' Movie
పారితోషికాన్ని తగ్గించుకోవాలి..

పారితోషికాన్ని తగ్గించుకోవాలి..

ఇక లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ కొంత ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నటీనటులు వీలైనంత వరకు వారి పారితోషికాన్ని తగ్గించుకోవాల్సి బాధ్యత ఉందని అన్నారు. ఇక నాని V సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాని టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X