»   » శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు.. ఆ చెత్త సిగ్గుచేటు.. పరువునష్టం దావా!

శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు.. ఆ చెత్త సిగ్గుచేటు.. పరువునష్టం దావా!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Nani Wife Anjana Responds On Sri Reddy Comments

  గత కొద్దికాలంగా నేచురల్ స్టార్ నానీపై ఓ సినీ నటి దారుణమైన కామెంట్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్‌కు ముందు ఓ టెలివిజన్ ఛానెల్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో హీరో నాని పరోక్షంగా స్పందించినట్టు అర్ధమవుతున్నది. బిగ్‌బాస్2 కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాని సదరు హీరోయిన్‌పై ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. నాని చేసిన ఘాటైన కామెంట్లు ఇటీవల సినీ పరిశ్రమపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నటిని ఉద్దేశించి చేసినవని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇంతకీ నాని ఏమన్నారంటే..

  వారిలా దిగజారలేను..

  వారిలా దిగజారలేను..

  వారిలా నేను దిగజారుడు మాటలు మాట్లాడలేను. వారికి దిగజారుడు పద్దతిలో స్పందించలేను. వాళ్లు కోరుకొన్నట్టుగా వారికి ఏదీ ఇచ్చుకోలేను. వారు చేస్తున్న దిగజారుడు ఆరోపణలకు ధీటుగా లీగల్ చర్యలు తీసుకొంటాను. పరువు నష్టం కేసు కింద వారికి లీగల్ నోటీసులు వెళ్లాయి అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

  కొందరిని టార్గెట్ చేయడం దారుణం

  ఏదో ఇష్టం వచ్చినట్టుగా కొందరిని టార్గెట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేయడం దారుణం. వారి ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా అవాస్తవాలను ప్రచారం చేయడం నాన్‌సెన్స్. అలాంటి చర్యల ద్వారా నన్ను వేధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డిస్టర్బ్ చేస్తున్నారు అని నాని ట్విట్టర్‌లో వెల్లడించారు.

  ఆ చెత్తనంతా పబ్లిష్ చేయడం

  నా మీద చేస్తున్న దాడికి నేను ఆందోళన చెందడం లేదు. నా భయమంతా సమాజం గురించి, అందులో జీవిస్తున్న ప్రతీ ఒక్కరి గురించి మాత్రమే. ఏదో అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం, ఆ చెత్తనంతా కొందరు కొన్ని క్లిక్స్ కోసం పబ్లిష్ చేయడం దారుణం.

  సహనానికి హద్దు ఉంది

  సహనానికి హద్దు ఉంది

  ప్రతీ ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్నీ ఆరోపణలు చేసినా నేను పట్టించుకోను. ఇకపై కూడా ఎలాంటి చెత్తపై నేను కామెంట్ కూడా చేయను. సహనానికి ఓ హద్దు ఉంటుంది అని నాని అన్నారు. సామాజిక మాద్యమాల్లో ఓ హీరోయిన్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తుందంటూ తన న్యాయవాది ద్వారా నాని నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందిన ఏడు రోజుల్లోగా సదరు నటి సిటీ సివిల్ కోర్టుకు సమాధానం ఇవ్వాలని నాని తరుపు న్యాయవాదులు సూచించినట్టు సమాచారం.

  బిగ్‌బాస్2 హోస్ట్‌గా నాని

  బిగ్‌బాస్2 హోస్ట్‌గా నాని

  తెలుగు బిగ్‌బాస్2 షో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హోస్ట్‌గా నాని మంచి ఆదరణతోపాటు, బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చింది.

  నానీ ట్వీట్‌కు శ్రీరెడ్డి జవాబు

  నాని ట్విట్టర్‌లో పోస్టు చేసిన లీగల్ నోటీసుకు సంబంధించిన దానికి శ్రీరెడ్డి తిరుగు జవాబిచ్చింది. తప్పుకుండా మనం లీగల్‌గా ఫైట్ చేద్దాం అని నానీ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం గమనార్హం.

  English summary
  Natural Star Nani was soft targetted by a contraversial heroine. Before Bigg Boss show, Nani faced worst situation in facebook. In this occassion, Nani moves forward to take legal action, which made filthy comments against him. Nani tweeted his a notice.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more