అమల ప్రశంసను మరిచిపోలేను.. అమ్మకు చూపించి మురిసిపోయా.. నాని
నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కాంబినేషన్‌లో వస్తున్న దేవదాస్ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో నాగార్జునతో నటించే అవకాశం రావడంపై నాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్ సందర్భంగా తనను అన్ని రకాలుగా నాగ్ ప్రోత్సహించేవారని నాని చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జున, అమల ఇచ్చిన ప్రశంసను గుర్తుచేసుకొన్నారు.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
ఐఫా అవార్డుల్లో భాగంగా రానాతో కలిసి నేను హోస్ట్‌గా వ్యవహరించాను. ఈ వేడుకకు నాగార్జున, అమల హాజరయ్యారు. రెడ్ కార్పెట్ వద్ద నాని, రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మీరెలా ఉండబోతుందీ కార్యక్రమం అని యాంకర్ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇస్తూ నాని అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు కూడా చూస్తాను అని చెబుతుండగా.. అమల ముందుకొచ్చి నాపై మరింత ప్రేమతో కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

నాని చక్కగా తెలుగు మాట్లాడుతాడు. బాగా నటిస్తాడు అని అమల చెప్పిన వీడియోను ఎవరో నాకు ట్యాగ్ చేశారు. ఆ వీడియో చూసి నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మా అమ్మకు, వైఫ్‌కు చూపించి అమల గారు ఇలా అన్నారు అని చెప్పి మురిసిపోయాను అని నాని చెప్పారు.


Click it and Unblock the Notifications











