మృణాళ్ థాకూర్‌తో లిప్‌లాక్.. నాని ఇంట్లో గొడవలా? నేచురల్ స్టార్ భార్య రియాక్షన్ ఏమిటంటే?
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ వెళ్తున్నారు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా సినిమాల విజయాల తర్వాత మరోసారి విభిన్నమైన కంటెంట్‌తో హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మృణాల్ సేన్, కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..
ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా నటులను తీసుకోవడం లేదనే సరికాదు. పాత్రను బట్టి ఎవరిని తీసుకొంటే బాగుంటుందనే విషయం ఆధారంగా నటీనటుల ఎంపిక జరిగింది. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన నటీనటులను తీసుకొన్నాం. హాయ్ నాన్న సినిమా తెలుగు సినిమానే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించే తెలుగు సినిమా అవుతుంది అని నాని అన్నారు.

హాయ్ నాన్న సినిమా ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో హాయ్ నాన్న అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నాం. హిందీలో మాత్రం టైటిల్ మార్చాం. హిందీలో హాయ్ పప్ప అనే టైటిల్‌తో వస్తున్నాం. హిందీలో నాన్న అంటే తాత.. అందుకే పప్ప అని పేరు మార్చాం అని నాని వివరణ ఇచ్చారు.
ఇక హాయ్ నాన్న సినిమాలో బాలనటిగా కియారా నటించింది. ఈ సినిమాలో నా పాత్ర ద్వారా ఎంత ఎమోషన్స్ పండిస్తానో అంతకంటే ఎక్కువగా కియారా ఎమోషన్స్ పండిస్తుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ పాప ఎంత మంచిగా యాక్టింగ్ చేసిందనే విషయం కాకుండా ఎంత భావోద్వేగాన్ని పండించిందనే విషయం చర్చ జరుగుతుంది. ఈ సినిమా అందర్నీ ఆలరిస్తుంది అని నాని అన్నారు.
నా సినిమాల్లో లిప్‌లాక్స్ కావాలని పెట్టడం లేదు. సన్నివేశం డిమాండ్ చేస్తే లేదా డైరెక్టర్ విజన్ డిమాండ్ చేస్తే నేను అలాంటి సీన్లను గౌరవించి నటిస్తాను. టీజర్ గానీ, పాటలతో గానీ సరదాకు ఇలాంటి లిప్‌లాక్స్ పెట్డం జరగలేదు. ప్రతీ సారి లిప్‌లాక్ సీన్లలో నటించినప్పుడు ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇప్పడు టీజర్ రిలీజ్ తర్వాత ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది అని నాని అన్నారు. అయితే నాని భార్య కూడా ప్రొఫెషనల్ కాబట్టి.. ఇలాంటి సీన్లను చాలా తేలికగా తీసుకొంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
భావోద్వేగాలు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్, చైల్డ్ సెంటిమెంట్ కంటెంట్‌తో వస్తున్న హై నాన్న చిత్రానికి ఖుషీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని, సినిమాటోగ్రాఫర్‌గా సాను జాన్ వర్గీస్ వ్యవహరించారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











