'ఢిల్లీ బెల్లీ' తెలుగు రీమేక్ టైటిల్ మారింది
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ''వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. ఇద్దరు అల్లరి కుర్రాళ్లు చేసే సందడి కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. తమిళంలో ఇటీవలే సెన్సార్ పూర్తయింది. అక్కడ ఈ చిత్రానికి యు సర్టిఫికేట్ లభించింది. అంజలి హీరోయిన్ గా నటించిన 'షాపింగ్‌మాల్', 'జర్నీ' చిత్రాలు మా సంస్థ నుంచే విడుదలయ్యాయి. మరోసారి ఆమె నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. ''అన్నారు.
ఆధునిక పోకడలతో సాగిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర విజయవంతమైంది. ఇక హన్సిక విషయానికి వస్తే అంత బిజీ స్టార్ కానప్పటికీ హన్సికా మోత్వానీ అంటే యూత్‌లో ఒక ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్' రూపంలో తనకు మంచి హిట్స్ వచ్చాయంటోంది. ప్రస్తుతం తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజిగా ఉన్న ఒకప్పటి ఈ బాలతారకు అక్కడ విజయ్ సరసన నటించిన 'వేలాయుధం' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. తమిళంలో ఒకప్పటి హీరోయిన్లు ఖుష్బూ, నగ్మాల తర్వాత హన్సికకి మాత్రమే ఇంతటి ఫాలోయింగ్ కనిపించిందని అక్కడ పత్రికలు అంటున్నాయి. అందుకే అక్కడ పెద్ద సంస్ధలు దృష్టి మొత్తం హన్సిక మీదే పెట్టాయి.
ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ.. '' ప్రేక్షకులు ప్రస్తుతం కామెడీ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో మా చిత్రం ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందింస్తుంది. తొలిసారిగా హన్సిక, అంజలితో కలిసి నటించాను. వారిద్దరు ఎంతో చక్కగా కలిసిపోయారు'అని పేర్కొన్నారు. సంగీతం: తమన్, సహనిర్మాత: సమన్యరెడ్డి, సమర్పణ: కె.వి.శ్రీధర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications












