»   » పార్టీ పాలిటిక్స్: ఆ పని చేసిందెవరంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేట!

పార్టీ పాలిటిక్స్: ఆ పని చేసిందెవరంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్... ప్రస్తుతం తన సినిమాలేవో తాను తీసుకుంటూ కెరీర్ మీదనే తన ఫోకస్ పెట్టాడు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఓ సారి తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేసారే తప్ప...ఎప్పూడూ రాజకీయాలు చేయలేదు, పాలిటిక్స్ ఎక్కడా మాట్లాడలేదు. కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.

అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో జూ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టారంటూ ప్రచారం మొదలైంది. 'నవ భారత్ నేషనల్ పార్టీ' పేరుతో ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పార్టీ సింబల్ కూడా జనసేన పార్టీ సింబల్ ను పోలి ఉండటం గమనార్హం.

అందులో ఏముంది?

అందులో ఏముంది?

ఆ లెటర్ హెడ్ లో నవ భారత్ నేషనల్ పార్టీ వారు.... ఎన్టీఆర్ ను ప్రెసిడెంటుగా నియమిస్తున్నట్లు ఉంది. కొన్ని అధికారులు, పవర్స్ కూడా ఆయనకు కట్టబెడుతన్నట్లు అందులో పేర్కొన్నారు. భద్రతే మా లక్ష్యం-మానవతే మా నినాదం.... అనేది పార్టీ స్లోగన్.

ఎన్టీఆర్ ప్రమేయం లేదు

ఎన్టీఆర్ ప్రమేయం లేదు

అసలు ఎన్టీఆర్ ప్రమేయం లేకుండా ఎవరో కావాలనే ‘నవ భారత్ నేషనల్ పార్టీ' పేరుతో ఇదంతా క్రియేట్ చేసి... ఆయనపై అనవసర రాజకీయం చేస్తున్నారని స్పష్టం అవుతోంని అంటున్నారు అభిమానులు.

ఎవరూ నమ్మవద్దు

ఎవరూ నమ్మవద్దు

ఎన్టీఆర్ కు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని ఆయన అభిమానులు అంటున్నారు. దీన్ని ఎవరూ నమ్మవద్దని అభిమానులు కోరుతున్నారు.

పనిచేయని ఫోన్ నెంబర్స్

పనిచేయని ఫోన్ నెంబర్స్

సదరు లెటర్ హెడ్ మీద ఉన్న ఫోన్ నెంబర్స్ కూడా పని చేయడం లేదు. మేడ్చల్ లోని బైరవ గుట్టలో పార్టీ ఆఫీసు ఉన్నట్లు లెటర్ హెడ్ మీద ఉంది.

ఎన్టీఆర్ అభిమానుల వేట

ఎన్టీఆర్ అభిమానుల వేట

ఈ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి రాగానే.... ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన వారి కోసం ఆయన అభిమానులు వేట ప్రారంభించారు. వారిని పట్టించి పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
A letter has been circulating in the social media that a new party has appointed NTR as its president. The party name is 'Nava Bharath National Party' with a caption 'Bhadrate Maa Lakshaym.. Manavathe Ma Ninaadam'. The letter says that NTR has been appointed as a president of the party in Andhra Pradesh State.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu