స్టేజి పై సమంత, కలర్స్ స్వాతి అల్లరి (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : నవదీప్, కలర్స్ స్వాతి కాంబినేష్ లో రూపొందుతున్న చిత్రం 'బంగారు కోడి పెట్ట'. బోణి ఫేమ్ రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. పెద్దగా క్రేజ్ లేని నవదీప్,కలర్స్ స్వాతిలతో చేస్తున్న ఈ చిత్రం కొత్త తరహా కాన్సెప్టు తో కథే ప్రధానంశంగా రూపొందుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఘనంగా నిన్న రాత్రి జరిగింది.
ఈ ఆడియో వేడకకు సమంత గెస్ట్ గా హాజరై దుమ్ము రేపింది. కలర్స్ స్వాతి..స్టేజీపై అల్లరి చేసింది. ఈ చిత్రాన్ని సునీత ధాటే నిర్మిస్తోంది.
ఆమె తన గురు ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ట
మహేష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాటలన్నీ రాకింగ్ స్టైల్ లోనే ఉంటాయని చెప్తున్నారు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ చిత్రం కథ మూడు కథలతో ఫన్ తో మిక్స్ అయ్యి నడుస్తుంది.
చిత్రం ఆడియో విశేషాలు స్లైడ్ షో లో...

తొలిపాటను సందీప్ కిషన్, రెండో పాటను దేవకట్టా, మూడో పాటను అల్లు అరవింద్, నాలుగో పాటను అనంత్ శ్రీరామ్, ఐదో పాటను సురేష్ బాబు ఆవిష్కరించారు.

థియోట్రికల్ ట్రైలర్స్ ని సమంత విడుదల చేసి,అల్లు అరవింద్ కు ఇచ్చారు.

పాటల సీడిలను అల్లు అరవింద్ ఆవిష్కరించి సమంతకు ఇచ్చారు.

సమంత మాట్లాడుతూ... ప్రతీ పంక్షన్ లోనూ హీరో గురించి మాట్లాడతారు. కానీ నేను ఇక్కడ హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాను. సుబ్రమణ్యపురం సినిమాలో స్వాతిని చూసాను. తెలుగులో పెద్ద హీరోయిన్ ఆమె అని అప్పటికి నాకు తెలియదు. కళ్ళతో ఆమె నటించిన దానికి మేమందరం పడిపోయాం. మహేష్ మంచి ట్యూన్లిచ్చారు. ఆయన చేసిన ప్రస్దానం పాటలు విన్నాను అని తెలిపారు.

దర్శకుడు రాజ్ పిప్పళ్ల మాట్లాడుతూ...అందరికీ ఓ బంగారు కోడిపెట్ట ఉంటుంది. దానితో ఆనందం,మనశ్సాంతి దొరుకుతుంది. దాని కోసం తట్ట, బుట్ట క్రింద వెతుకుతాం. ఈ సినిమాలో రియలైజ్ అయ్యేదేమిటంటే...బంగారు కోడిపెట్ట మన మనస్సులోనే ఉంది అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ... సునీత నా మేనకోడలు లాంటిది. మా అబ్బాయిలతో మా ఇంట్లోనే ఉంటుంది. సురేష్ బాబు దగ్గర శిష్యరికం చేసింది. తను ఎప్పుడో పరిశ్రమకు రావాల్సింది అన్నారు.

నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ... అల్లు అరవింద్ గారు మా మామయ్యగారి కి ఫ్యామిలీ ఫ్రెండ్. మా మామయ్య, అరవింద్ గారు చెడ్డీ దోస్తీలు. అరవింద్ గారు,సురేష్ గారు దగ్గర చాలా నేర్చుకున్నా అన్నారు.

హీరోయిన్ కలర్స్ స్వాతి మాట్లాడుతూ... సునీత, రాజ్ లతో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. రియల్ జర్నీలా ఉంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. సునీ ఎనర్జీ నైస్ అన్నారు.

నవదీప్ మాట్లాడుతూ... ఈ సినిమాకు అందరూ తలో కాస్త ఇన్ పుట్స్ ఇచ్చి ఈ సినిమాను చేసాం. బెటర్ మెంట్ చేసాం. న్యూ జనరేషన్ మూవీ వచ్చింది అని అందరూ అంటారు అన్నాడు.

సురేష్ బాబు.. మాట్లాడుతూ... అందరూ ప్రతిభావంతులు కలిసి చేసిన సినిమా ఇది. బ్రోచర్,ట్రైలర్ చాలా బాగున్నాయి. నైస్ పబ్లిసిటీ , సునీత విల్ రాక్ అన్నారు.


Click it and Unblock the Notifications











