కలర్స్ స్వాతి 'బంగారు కోడి పెట్ట' నవదీప్

By Srikanya

హైదరాబాద్ : నవదీప్, కలర్స్ స్వాతి కాంబినేష్ లో రూపొందుతున్న చిత్రం 'బంగారు కోడి పెట్ట'. బోణి ఫేమ్ రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. సుమంత్,కీర్తి కర్భందాలతో చేసిన బోణి చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. మార్కెట్లో క్రేజ్ లేని నవదీప్,కలర్స్ స్వాతిలతో చేస్తున్న ఈ చిత్రం కొత్త తరహా కాన్సెప్టు తో కథే ప్రధానంశంగా రూపొందుతుందని చెప్తున్నారు.

ఈ చిత్రాన్ని సునీత ధాటే నిర్మిస్తోంది. ఆమె తన గురు ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహేష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాటలన్నీ రాకింగ్ స్టైల్ లోనే ఉంటాయని చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని నిర్మాతలు విడుదల చేసారు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం విడుదల చేస్తారని చెప్తున్నారు.

ఇక ప్రస్తుతం కలర్స్ స్వాతికి పెద్దగా సినిమాలు తమిళంలోనూ లేవు. తెలుగులో కందిరీగ తర్వాత ఆఫర్లేమీ రాలేదు. ఆ మధ్య ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా అనుకున్నారు కానీ అది ముందుకు వెళ్లలేదు. అప్పలరాజు డిజాస్టర్ కావటంతో ఆమెను హీరోయిన్ గా తీసుకునే వారు సైతం కరువయ్యారు. అయితే ఈ విషయమై కలర్స్ స్వాతి సొంత విశ్లేషణ చేసుకుటోంది.

మరో ప్రక్క నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా 'స్వామి రా..రా..' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరస ప్లాపుల్లో ఉన్న నిఖిల్,కలర్స్ స్వాతి ఇద్దరూ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''మా తొలి ప్రయత్నంగా నిఖిల్‌తో 'వీడు తేడా' నిర్మించాం. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ రెండో సినిమాని కూడా ఎక్కడా రాజీ పడకుండా లావిష్‌గా తెరకెక్కించనున్నాం. కేరళ, కర్నాటక, తమిళనాడుల్లోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X