ఎన్టీఆర్ కి గిప్ట్ గా 15 లక్షల ఖరీదు చేసే నవరత్నాల చీర
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన ఓ బాలిక ఆయనకు కాబోయే భార్య లక్ష్మీ ప్రణతి కోసం నవరత్నాల చీరను స్వయంగా రూపొందించింది. పెళ్లి కానుకగా దీన్ని ఆమెకు బహూకరిస్తున్నట్లు ఆ బాలిక తెలిపింది. అది మామూలు చీర కాదు. నవరత్నాలతో అలంకరించిన అరుదైన చీర. కెంపులు, ముత్యా లు, పగడాలు, పచ్చలు, పుష్యరాగాలు, వజ్రాలు, నీలాలు, గోమేధికాలు, వైఢూర్యాలు ఇలా నవరత్నాలతో ఆ చీర సరి కొత్త అందాలతో కట్టిపడేస్తోంది. దాదాపు రూ.15 లక్షల ఖరీదు చేసే ఈ చీర బరువు రెండు కిలోలకు పైమాటే. హిమాయత్‌నగర్‌కి చెందిన గోల్డెన్‌రాజు కుమార్తె 17 ఏళ్ల ముల్క అభినందన రెండు నెలలు కష్టపడి దీన్ని రూపొందిం చింది.
ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోన్న అభినందన జువెలరీ డిజైనర్‌గా తన కెరీర్‌ను మలుచుకోవాలనే ఈ ప్రత్యేకమైన చీరను తీర్చిదిద్దింది. వంశపారపర్యంగా తనకు సంక్రమించిన ఈ విద్యకు మరిన్ని కొత్త సొబగులు అద్ది తన ప్రత్యేకతను నిరూపించుకుంటోంది. తను ఎంతగానో అభిమానించే నటుడు జూనియర్ ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతిల వివాహం సందర్భంగా వారికి ఈ చీరను బహూకరించి తన అభిమానాన్ని చాటుకుంటానంది. భవిష్యత్‌లో వినూత్నమైన జువెలరీ డిజైన్ చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటానని, అవినీతి, పర్యావరణ కాలుష్యం తదితర అంశాలపై పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానని అభినందన తెలిపింది. అభినందన 2009లో బాలశ్రీ ఉగాది పురస్కారం, మరెన్నో ఇతర పురస్కారాలను అందుకుంది. ఈ చీరను విలేకర్ల సమావేశంలో ప్రదర్శించారు. రెండు రోజుల్లో ఎన్టీఆర్‌ను కలిసి దీన్ని బహూకరించనున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











