నాంపల్లి కోర్టుకు హాజరైన హీరో నవదీప్
తెలుగు యువ హీరో నవదీప్ ను జనవరి 4న తమ ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే...
2010లో నవదీప్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు(మద్యం సేవించి వాహనం నడిపిన కేసు) నమోదైంది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుండటంతో, అందులో భాగంగా శుక్రవారం నవదీప్ విచారణకు హాజరయ్యాడు. విచారణ ఇంకా పూర్తి కాక పోవడంతో జనవరి 4న తిరిగి హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టాలీవుడ్‌లో ఈ మధ్య యువ హీరోలు తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన కేసులు చాలానే నమోదు అవుతున్నాయి. ఇటీవల హీరో నిఖిల్ తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. కోర్టు అతని డ్రైవింగ్ లైసెన్సును సంవత్సరం పాటు సస్పెండ్ చేయడంతో పాటు భారీ మొత్తంలో జరిమాన విధించింది కూడా...


Click it and Unblock the Notifications











