కిమ్ శర్మతో రొమాన్స్ చేస్తున్న నవదీప్

By Srikanya

ముసుగు వెయ్యద్దు మనస్సు మీద అంటూ 'ఖడ్గం'లో రెచ్చిపోయి నటించిన కిమ్ శర్మ ను ఎవరూ మర్చిపోలేరు. అయితే ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యి తెలుగుకి దూరం అయింది. అయితే తాజాగా ఆమె నవదీప్ తో కలిసి 'యాగం' చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అయితే ఈ ఐటం సాంగ్ లో ఆమె అందాల ప్రదర్శన భారీ ఎత్తునే చేసిందని చెప్తున్నారు. ఈ ఒక్క పాటతో మళ్ళీ తెలుగులో వరస ఆఫర్స్ పొందాలనే ఆలోచనతోనే అదరకొట్టిందని చెప్తున్నారు. ఇక కిమ్ శర్మ ఆ మధ్య క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య ఆ బంధం ఏమీ లేదు. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టిందని చెప్తున్నారు. ఇక ఈ యాగం చిత్రంలో భూమిక ప్రధాన పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్ తో తమ్ముడు చిత్రం రూపొందించిన పి.ఎ.అరుణ్‌ప్రసాద్‌ దర్శకుడు. వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X