నవదీప్ కు నయనతార క్లాస్
నవదీప్ స్టూడెంట్ గా, నయనతార లెక్చరర్ గా మల్లిక ఐ లవ్ యు చిత్రంలో కనిపించనునన్నారు. తమిళ ఆగిన్ డబ్బింగ్ గా వస్తున్న ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం డైరక్ట్ చేసిన ఈ చిత్రం హిందీ హిట్ మై హూనాకి కాపీ. షారూఖ్ చేసిన పాత్రను అజిత్ చేస్తే, నయనతార లెక్చరర్ గా సుస్మితా సేన్ చేసిన పాత్రలో అలరిస్తుంది. ఇక నవదీప్ హీరో తమ్ముడుగా కనపడతాడు. అతనిలో మార్పు తీసుకువచ్చి అతనికొచ్చే ప్రమాదాన్నుంచి రక్షిస్తూ అజిత్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అలరిస్తాడు. ఇక ఈ చిత్రం తమిళనాట ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే నయనతార, నవదీప్ తెలుగువారికి పరిచయం ఉండటంతో ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మళయాళ నటుడు జయరామ్ కామిడి నవ్విస్తే, యవన్ శంకర్ రాజా సంగీతం అలరిస్తుందని నిర్మాతలు చెప్తున్నారు.
egan raju sundaram ajith navadeep teacher nayanatara నవదీప్ స్టూడెంట్ నయనతార లెక్చరర్ మల్లిక ఐ లవ్ యు అజిత్ యాక్షన్ ఎపిసోడ్స్


Click it and Unblock the Notifications