నవదీప్-సదా ‘మైత్రి’ ఆడియో రిలీజ్డ్
హైదరాబాద్: సదా, నవదీప్ జంటగా హను క్రియేషన్స్ పతాకంపై సూర్యరాజు దర్శకత్వంలో రాజేష్‌కుమార్ నిర్మించిన చిత్రం 'మైత్రి'. ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, ప్రకాశం జిల్లా ఎ.ఎస్.పి సమయ్, హీరో సుధీర్ బాబు, సూర్యచంద్రరావు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమయ్ తొలి సీడీ ఆవిష్కరించి నవదీప్‌కి అందించారు.
నవదీప్ మాట్లాడుతూ....వికాస్ ఈచిత్రానికి అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. పాటలన్నీ నాకు నచ్చాయి. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. సదా బాగా నటించింది. మా టీమ్ అంతా కష్ట పడి పని చేసారు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సదా కీలకపాత్రలో నటించిందని, ఓ సందర్భంలో కలిసిన ఈ జంట తమ ఆశయాలను నెరవేర్చుకునే నేపధ్యంలో ఒకరితో ఒకరు స్నేహం చేస్తారని, ఆ స్నేహం ఎటువైపుకు దారితీసిందనేదే చిత్ర కథాంశమని తెలిపారు.
నిర్మాత రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శ్రీను, సుమన్‌శెట్టి, బిక్షు, కళ్లు చిదంబరం, సత్యం రాజేష్, అర్జున్, లక్ష్మణ్, పాపారాయుడు, వంశీ, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వికాస్, కెమెరా: సెల్వ, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: రాజేష్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: సూర్యరాజు.


Click it and Unblock the Notifications











