For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విమాన ప్రమాదం నుండి బయిటపడ్డ నవదీప్

    By Srikanya
    |

    రీసెంట్ గా నవదీప్ ప్లైట్ క్లాష్ నుంచి బయిట పడ్డారు. ఆ విషయాన్ని ఆయన తన స్నేహితులతో పంచుకుంటూ..టి గాడ.నేను షాక్ లో కూర్చుని రాస్తున్నాను ఇది..నేను ప్రొద్దున్నే నిద్ర లేచి చూస్తే మా మేనేజర్ పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకుని ఊపేస్తూ నా తల మీద అతని చేతిని పెట్టి గాడ్ బ్లెస్ యు డియర్..నువ్వు బ్రతికే ఉన్నావ్ అన్నాడు..నాకు అర్దం కాలేదు. తర్వాత ఆయన చెప్పేది విన్నాక విషయం అర్దమైంది..నేను ఉదయమే ఆ ప్లైట్ కి వెళ్ళాలి కానీ మేనేజర్ కన్ఫర్మ్ చేయకపోవటంతో ఆగిపోయాను. ఆ ప్లైట్ కూలిపోయి పద్దెనిమిది మంది చనిపోయారు..అందులో పది మంది ఇండియన్సే అని తెలిసింది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇదంతా ఖాట్మండులో ఉండి నవదీప్ రాసుకొచ్చింది. ప్రస్తుతం నవదీప్ ఓ టీవీ ఛానెల్ నిమిత్తం సూపర్ అనే పోగ్రాం చేస్తున్నాడు.

    రీసెంట్ గా వచ్చిన ముగ్గురు చిత్రం సైతం నవదీప్ ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాంతో కొత్త అవకాశాలు రాక ఏం చెయ్యాలో అర్దం కాని స్ధితిలో ఉన్న నవదీప్ ని బుల్లి తెర పలకరించింది. వైజయింతీ టెలీ వెంచర్స్ వారు నిర్మిస్తున్న సూపర్ అనే పోగ్రామ్ కి నవదీప్ ని తీసుకున్నారు. ఈటీవీ తెలుగులో ప్రసారమయ్యే ఈ పోగ్రాం చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాక మొదటి టెలివిజన్ సీరియల్ ఇతర దేశాల్లో తీస్తున్నది అని చెప్తున్నారు. ధాయల్యాండ్ లో షూటింగ్ మొత్తం జరుపుతారు. అలాగే నవదీప్ కి ఈ పోగ్రామ్ లో పదిహేను మంది హీరోయిన్స్ ఉంటారు. వారు వెండితెరమీద వెలిగిన వారు, బుల్లి తెరమీద మెరసేవారు అవుతారని చెప్తున్నారు. పూర్తి సెట్స్ తో సినిమాని తలపించేలా వైజయింతీవారు భారీగా ఈ పోగ్రామ్ ని ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Actor Navdeep narrowly missed his death from a plain crash.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X