ఆ కథకి ఏ తెలుగు హీరో ఒప్పుకోడు: నవదీప్

By Bojja Kumar

హైదరాబాద్: నవదీప్, కావ్యశెట్టి జంటగా ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మొదలైంది. డి.శ్రీనివాసరావు సమర్పణలో కొప్పుల రమేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తుపు సన్నివేశానికి జ్వలా గుత్తా క్లాప్ ఇవ్వగా, నిర్మాత నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేసారు.

ఈ సినిమా గురించి నవదీప్ మాట్లాడుతూ...కథ విని నేను మొదట భయ పడ్డాను. నాకు తెలిసి ఇతర హీరోలు ఎవరూ ఈ సినిమా చేయరు. సబ్జెక్టు గురించి బాగా ఆలోచించి ఒప్పుకున్నాను. తెలుగు సినిమాకే కాదు సౌత్ ఇండస్ట్రీకే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...'కథ, సినిమా గురించి చెప్పడం కన్నా సినిమా తీసి మీకు చూపడమే బెటర్. ఈ సినిమా పూర్తిగా కొత్త కాన్సెప్టు. మంచి విజయం సాధిస్తుంది. నవదీప్‌కి టైలర్ మేడ్ క్యారెక్టర్ క్యారెక్టర్ అవుతుంది' అన్నారు. సమర్పకులు డిఎస్ రావు మాట్లాడుతూ...'రెగ్యులర్ మూవీస్ కి భిన్నంగా కొత్త కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫోటోగ్రఫీ హైలెట్ గా ఉంటుంది. శరవేగంగా షూటింగ్ జరిపి జూన్ ఆఖరున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా చూసిన తల్లిదండ్రులచే కన్నీళ్లు పెట్టిస్తుంది. అంత ఎమోషనల్ గా ఉంటుంది' అన్నారు.

Navdeep new film details

ఆశిష్ గాంధీ, జియా ఖాన్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్, కెమెరా: వాసు, మ్యూజిక్: చిన్నా, ఆర్ట్: బాబ్జీ, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినేని శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X