పాపం వేషాలు లేకే నవదీప్ అలా
రీసెంట్ గా వచ్చిన ముగ్గురు చిత్రం సైతం నవదీప్ ని తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాంతో కొత్త అవకాశాలు రాక ఏం చెయ్యాలో అర్దం కాని స్ధితిలో ఉన్న నవదీప్ ని బుల్లి తెర పలకరించింది. వైజయింతీ టెలీ వెంచర్స్ వారు నిర్మిస్తున్న సూపర్ అనే పోగ్రామ్ కి నవదీప్ ని తీసుకున్నారు. ఈటీవీ తెలుగులో ప్రసారమయ్యే ఈ పోగ్రాం చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాక మొదటి టెలివిజన్ సీరియల్ ఇతర దేశాల్లో తీస్తున్నది అని చెప్తున్నారు. ధాయల్యాండ్ లో షూటింగ్ మొత్తం జరుపుతారు. అలాగే నవదీప్ కి ఈ పోగ్రామ్ లో పదిహేను మంది హీరోయిన్స్ ఉంటారు. వారు వెండితెరమీద వెలిగిన వారు, బుల్లి తెరమీద మెరసేవారు అవుతారని చెప్తున్నారు. పూర్తి సెట్స్ తో సినిమాని తలపించేలా వైజయింతీవారు భారీగా ఈ పోగ్రామ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇక నవదీప్ ఇలా టీవి సైడ్ వచ్చేస్తే అడపా దడపా వచ్చే సినిమా ఆఫర్స్ కూడా రావటం కష్టమేనంటున్నారు. ముగ్గురులో నవదీప్ బాగానే చేసాడని పేరు వచ్చినా ఫలితం లేకుండా పోవటంతో డిప్రెషన్ లో ఉన్న నవదీప్ ఇలా టీవి సైడ్ రావటానికి నిర్ణయింతీసుకున్నట్లు చెప్తున్నారు. నవదీప్ గతంలో వైజయింతీవారు నిర్మించిన ఓ శాంతి చిత్రంలో కీలకమైన పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయం తోటే నవదీప్ ని ఈ పోగ్రామ్ కి ఒప్పించారు. కాబట్టి నవదీప్ ని టీవీ వాళ్ళు కూడామొహమాటం లేకుండా అడిగెయ్యవచ్చు.


Click it and Unblock the Notifications











