నవదీప్ అవయవదానం
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ఇటీవల అవయవదానం కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్‌ను విజిట్ చేసారు. ఈ సందర్భంగా అవయవదానం వల్ల వివిధ లోపాలతో బాధ పడుతున్న వారికి జరిగే మేలు గురించి తెలుసుకున్న నవదీప్ తాను కూడా అవయవదానం చేస్తానని వాగ్ధానము చేసారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేయడం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందని రియలైజ్ అయ్యారు.
ఆ ఆర్గనైజేషన్‌ను విజిట్ చేసిన అనంతరం నవదీప్ తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 'మోహన్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా వెళ్లాను. అవయవదానం గొప్పదనం గురించి తెలుసుకున్నాను. నేను కూడా అవయవదానంలో భాగస్వామిని కావాలని నిర్ణయించుకుని వాగ్ధానం చేసాను. అవయవదానం చేయడం వల్ల ఎంతో మందికి కొత్త జీవితం ఇచ్చిన వారం అవుతాం' అని పేర్కొన్నారు.
నవదీప్ ప్రస్తుతం ఆరు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ఈ వివరాల గురించి వెల్లడిస్తూ 'ప్రస్తుతం చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. వసూల్ రాజా, బంగారు కోడిపెట్ట, పొగ చిత్రాలు పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. నాపై నమ్మకం ఉంచి నందుకు సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేసారు. నవదీప్ ఇటీవల విడుదలైన 'బాద్ షా' చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. సినిమాకు కీలకంగా మారిన పాత్రలో నవదీప్ తనదైన విలనిజాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











