Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇదే లాస్ట్ డే.. కనివినీ ఎరుగని చివరి రోజు.. నవదీప్ కామెంట్స్‌కు రానా రియాక్షన్
టాలీవుడ్ బ్యాచ్‌లర్ లిస్ట్ మెల్లిమెల్లిగా తగ్గుతోంది. ఈ కరోనా విజృంభణలోనే ఇప్పటికి ఇద్దరు యువ హీరోల పెళ్లిళ్లు అయ్యాయి. కోవిడ్ నిబంధనలను అనుసరించి నిఖిల్-పల్లవి, నితిన్-షాలినిల వివాహాలు జరిగాయి. ఇక టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అయిన రానా కూడా నేడు ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. ప్రేమించిన ప్రేయసి మిహీకాను వివాహం చేసుకోబోతోండటంతో మొహంలో సంతోషం వంద రెట్లైంది.
ఫోటోలు వైరల్..
నేటి రాత్రి రానా-మిహీకల వివాహం జరగబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండ్రోజుల క్రితమే దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. పసుపు ఫంక్షన్, మెహిందీ ఫంక్షన్ అంటూ బయటకు వచ్చినా రానా, మిహీకాల ఫోటోలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దగ్గుబాటి పిక్..
నేటి ఉదయం నంచి సోషల్ మీడియాలో దగ్గుబాటి పిక్ ఒకటి రచ్చ చేస్తోంది. వెంకటేష్, సురేష్ బాబు, రానా ముగ్గురు పోజులు ఇవ్వగా.. క్లిక్ చేసిన ఫోటో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. వాటిని చూస్తుంటేనే వారి ఇంట్లోని ఆనందం, ఆ పెళ్లి సందడి అంతా కనిపిస్తోంది.
తక్కువ మందే..
కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిథులే హాజరు కాబోతోన్నారని తెలుస్తోంది. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలు కాకుండా సినీ పరిశ్రమ నుంచి మెగా, మంచు ఫ్యామిలీలోని కొంత మంది ఈవెంట్‌కు హాజరు కాబోతోన్నారని తెలుస్తోంది. అయితే పెళ్లి వేడుకల్లో రానా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం బాగానే వాడుతున్నాడు.
నవదీప్ కామెంట్స్..
మార్నింగ్ నుంచి వైరల్ అవుతున్న రానా, వెంకీ, సురేష్ బాబుల ఫోటోను నవదీప్ షేర్ చేస్తూ.. ‘కని/వినీ/ఎరుగని బిగ్/లాస్ట్/ఫైనల్ డే బెస్ట్ విషెస్ డియర్ ఫ్రెండ్' అంటూ రానాపై జాలీ చూపించాడు. ఇక నవదీప్ కామెంట్‌కు రానా కూడా ఫక్కున నవ్వేశాడు. ఈ మేరకు నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. మరి నవదీప్ ఇంకెప్పుడు పెళ్లి పీఠలు ఎక్కుతాడో చూడాలి.