నవదీప్, శశాంక్ కొత్త చిత్రం ‘అంత సీన్ లేదు’
హైదరాబాద్: నవదీప్, శశాంక్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా "అంత సీన్ లేదు". బాడ్ మంకీ పతాకం పై చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న " అంత సీన్ లేదు" గురించి చిత్ర నిర్మాత చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ "కొత్త తరహా క్రైమ్ కామెడి స్టొరీతో వస్తున్న మా 'అంత సీన్ లేదు' సినిమా చాలా వినూత్నంగా ఉంటుందని, సినిమా ప్రారంభం నుండి చివరివరకు ఉత్కంట భరితంగా సాగుతూ ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుందని అన్నారు. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటున్న 'అంత సీన్ లేదు' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు.

ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న వెంకట్ కాచర్ల మాట్లాడుతూ 'అంత సీన్ లేదు' స్టొరీ ఒక రోజు రాత్రి జరిగిన సంఘటనల చుట్టు తిరుగుతుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మరియు ఛాయాగ్రహణ పనితనం హైలెట్ గా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు.
అంకిత, రెహనా మల్హోత్రా ఈ సినిమా ద్వారా నాయికలుగా పరిచయమవుతున్నారు.. ఇతర ముఖ్య పాత్రలలో నాజర్, ఆదిత్యా మీనన్, సంజయ్ స్వరూప్, అమిత్, తాగుబోతు రమేశ్, రామ్ జగన్, రత్నశేకర్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక నిపుణులు:
సంగీతం: కల్యాణి కోడూరి. కెమెరా: మిచ్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, కాస్ట్యూమ్ డిజైనర్: భక్తి రెడ్డి, ఎడిటర్: రవి మాన్ల, నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకట్ కాచర్ల.


Click it and Unblock the Notifications











