twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నక్సల్ గ(ద)ళం.( 'దళం'.. ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: అందాల రాక్షసి చిత్రంలో హీరోగా చేసిన నవీన్ చంద్ర రెండో చిత్రం 'దళం' ఈ రోజు విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర నక్సలైట్ గా కనిపించనున్నారు. జీవన రెడ్డి అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. నవీన్ చంద్ర సరసన పియాబాజ్‌పేయ్ కనిపించనుంది. జన జీవన స్రవంతిలో కలిసి నక్సలైట్ల జీవితం ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

    "ఉద్వేగభరితమైన ఉపన్యాసాలకు ఆకర్షితులై ఉద్యమంలోకి వెళ్లిన వాళ్లు, అక్కడ ఏమీ చేయలేమని తెలుసుకున్నాక జనజీవన స్రవంతిలో కలుస్తారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్లకి అడవే నయం అనిపించిందా? జనంలో జీవం చూశారా? అనేదే ఈ చిత్రం కథ'. ఆ నలుగురూ... తుపాకీ వదిలేసిన అన్నలు. అడవిలో ఉండి చేసే పోరాటాల వల్ల... తమ లక్ష్యం నెరవేరదని అర్థమైంది. అందుకే.. అడవినీ, ఆవేశాన్నీ, తిరుగుబాటు భావాలనూ విడిచి జన జీవన స్రవంతిలో కలిశారు. ఈ సమాజం వారికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది? వారి జీవితాలపై పోలీసు, రాజకీయ, మీడియా వ్యవస్థల ప్రభావం ఏమిటన్న విషయాలన్నీ మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు .

    దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ... "దాదాపు మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ప్రతిరోజూ పేపర్లలో వస్తున్న వార్తలు, సంఘటనల స్ఫూర్తితో కథను సిద్ధం చేసుకున్నాను. అభ్యుదయ భావాలతో అడవిబాట పట్టిన కొందరు యువకులు సమాజ సంస్కరణ కోసం ఏం చేశారు? వారికి రాజకీయ నాయకుల నుంచి ఎదురైన సమస్యలేమిటి? తామనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా? 'దళం' సిద్ధాంతాలేమిటి? అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఆద్యంతం ఆలోచింపజేసే సినిమా అవుతుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. నవీన్ చంద్ర, పియా బాజ్‌పాయ్, నాజర్, సాయికుమార్ కీలక పాత్రల్ని పోషించారు. సీతారామశాస్త్రి రాసిన పాట సినిమాకే హైలైట్ అవుతుంది.''.

    నిర్మాత సుమంత్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ''కథాంశంలోని నవ్యత ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. త్వరలో విడుదల చేస్తాము''అన్నారు. ఇందులోని ప్రత్యేక గీతానికి నథాలియా కౌర్‌ నర్తించింది.

    బ్యానర్: మమ్ముత్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌
    నటీనటులు: నవీన్‌చంద్ర, పియాబాజ్‌పేయ్‌, కిషోర్‌, అభిమన్యుసింగ్, సాయికుమార్, సుబ్బరాజు, హర్ష, పృధ్వి, నాగేంద్రబాబు, ప్రగతి ప్రధాన పాత్రలు పోషించారు.
    ఛాయాగ్రహణం: సుధాకర్‌ యక్కంటి,
    పాటలు సీతారామశాస్త్రి,అనంత్ శ్రీరామ్, సాహతి
    సంగీతం: జేమ్స్ వసంతన్‌.
    ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: జి.శ్రీకృష్ణ,
    కథ,మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జీవన్‌రెడ్డి.

    English summary
    Dalam, starring Naveen Chandra and Piaa Bajpai, is an action drama directed by Jeevan Reddy. The film is bilingual in Telugu and Tamil that has Abhimanyu Singh playing a prominent role. The movie was in making for a very long time and will finally hit the screens on august 15th, marking a good release on an Independence Day. Titled as Koottam in Tamil, the story is about few youngsters insisting to bring out change within the current system in the Country. Nathalia Kaur will be seen doing a hot item number in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X