twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ లవ్ స్టోరీ (‘నా రాకుమారుడు’ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రేమకథ అంటేనే సేఫ్‌జోనర్ కనుక బడ్జెట్‌లో కూడా చేయవచ్చని కూడా దిగుతూంటారు. ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా చెప్పే కథ,కథనం కొత్తగా అనిపిస్తే వాటికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు.ఈ రోజు రిలీజవుతున్న 'నా రాకుమారుడు'కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఏం కొత్తదనం ఉంది...ప్రేక్షకులు ఎలా స్పందించారన్నది మరికొద్ది సేపటల్లో తేలనుంది.

    వైష్ణవ్‌ (నవీన్‌ చంద్ర)కి కాస్త గర్వం. ఎవరినీ పట్టించుకోడు. అమ్మాయి 'ఐ లవ్‌ యూ' చెబితే పొంగిపోడు.. అల్లరి పెడతాడు. ఎవరో మనల్ని ప్రేమించారని.. తిరిగి ప్రేమించేయకూడదు. మనకు నచ్చితేనే ఎదుటివాళ్లని ఇష్టపడాలి.. అనేది అతని సిద్దాంతం. వైష్ణవ్‌కి బిందు (రీతూ వర్మ) పరిచయం అవుతుంది. ఆమెకు చదువంటే ఇష్టం ఉండదు. అమ్మ (సితార)బలవంతం మీద కాలేజీ వెళ్తుందంతే. వైష్ణవ్‌ని ఇష్టపడుతుంది. అది ప్రేమగా మారుతుంది. మరి వైష్ణవ్‌ కూడా బిందుకు ప్రేమించాడా? లేదంటే అందరి అమ్మాయిల్లానే చూశాడా? వీరిద్దరి కథ ఎన్ని మలుపులు తిరిగిందనేదే ఈ సినిమా.

    దర్శకుడు సత్య మాట్లాడుతూ..."పూరీ జగన్నాథ్ వద్ద 'అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి', 'ఆంధ్రావాలా' వంటి చిత్రాలకు తాను పనిచేశానని, ఈ సినిమాలో కథానాయకుడు వైష్ణో పాత్రకు 'అందాల రాక్షసి' చిత్రం చూశాక నవీన్ చంద్రని ఎంచుకున్నామని తెలిపారు. ప్రేమకథే కానీ, అందులో ఓ సందేశం కూడా ఉంటుందని, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలన్న సందేశంతో ఈ చిత్రం సాగుతుందని, ఈ అంశంతోపాటుగా ఓ సాఫ్ట్ లవ్ స్టోరీ కూడా స్వీట్‌గా సాగుతుందని తెలిపారు. పూరీ జగన్నాథ్ స్టైల్లో చిత్రం ఉండాలని అనుకున్నా, తన ముద్రతో సాగుతుందని, ఫైట్లు మాత్రం ఆయన స్టైల్లోనే సాగుతాయని అన్నారు. మాస్ లుక్‌తో వున్న హీరోను మొదట ఎంపికచేసినప్పుడు, ఈ సినిమా కోసం క్లాస్‌గా మార్చే ప్రయత్నం చేశామని, అతను కూడా ఈ పాత్రను సవాల్‌గా తీసుకుని నటించారని తెలిపారు. ప్రేమకథ అంటేనే సేఫ్‌జోనర్ కనుక బడ్జెట్‌లో కూడా చేయవచ్చని అనుకున్నామని, కథానాయిక బిందు పాత్ర చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉండి ప్రేక్షకులకు నచ్చుతుంద" ని ఆయన వివరించారు.

    హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ... ''అనుకోకుండా అనే లఘు చిత్రంలో నటించా. 'బాద్‌షా'లో కాజల్‌ స్నేహితురాలిగా కనిపించా. ప్రేమ ఇష్క్‌ కాదల్‌లో కథానాయికగా ప్రమోషన్‌ వచ్చింది. ఆ తరవాత నటిస్తున్న చిత్రమిది. ఎమోషన్స్‌తో సాగే పాత్ర ఇది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నాను. బిందుగా తాను ఈ చిత్రంలో బబ్లీగరల్‌గా కన్పిస్తానని, తనకు చదువుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదని, హాయిగా స్నేహితులతో తిరగాలన్న కోరిక వుండే అమ్మాయి ఎలా వుంటుందో అలా తన పాత్ర ఉంటుందని'' అన్నారు.

    చిత్రం: నా రాకుమారుడు,
    సంస్థ: హరివిల్లు క్రియేషన్స్‌
    నటీనటులు: నవీన్‌ చంద్ర, రీతూవర్మ, సితార, ఎమ్మెస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, కొండవలస, మిక్కీ, సునీల్‌హార్స్‌, దీక్షాపంత్‌, రాధికారెడ్డి, భార్గవి తదితరులు.
    సంగీతం: అచ్చు,
    నిర్మాతలు: వజ్రాంగ్‌ (పి.ఎస్‌.రెడ్డి), కోడి వంశీ
    దర్శకత్వం: సత్య,
    విడుదల: శుక్రవారం

    English summary
    Andala Rakshasi fame Naveen Chandra’s ‘Naa Rakumarudu’ is going to hit the cinemas on 21st February. Written and directed by Satya, produced by Vajrang under Harivillu Creations, this ‘U’ certified film has Ritu Varma playing the female lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X