‘రచ్చ రంబోలా’ చేయబోతున్న నవీన్ చంద్ర

By Bojja Kumar

హైదరాబాద్: అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర త్వరలో తెరపై ‘రచ్చ రంబోలా' చేయబోతున్నారు. కవల సోదరులైన దర్మక్షేత్ర, ధర్మరక్షలను దర్శకులుగా పరిచయం చేస్తూ నానిగాడి సినిమా పతాకంపై బందరు బాబి, నాని కృష్ణ ఈ చిత్రం నిర్మించనున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

దర్శకులు ధర్మక్షేత్ర, దర్హరక్ష మాట్లాడుతూ...‘పక్కా మాస్ ఎంటర్టెనర్ ఇది. సామాజిక సమస్య నేపథ్యం కూడా ఉంటుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే కథాంశం ఇది. నవీన్ చంద్ర పాత్ర చిత్రీకరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మేం ఇంతకు ముందు ప్రభుదేవా, రామ్ గోపాల్ వర్మల దగ్గర దర్శకత్వశాఖలో పని చేసాం' అని చెప్పారు.

Naveen Chandra's 'Racha Rambola' from Dec 6th

నిర్మాతలు బందరు నాని, నాని కృష్ణ మాట్లాడుతూ...‘డిసెంబరు 6న చిత్రీకరణ మొదలు పెట్టి ఏకధాటి షూటింగుతో సినిమాను పూర్తి చేస్తాం. ‘ప్రేమ-ఇస్క్-కాదల్' చిత్రానికి స్వరాలు అందించిన శ్రవణ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X