twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే జబర్దస్త్‌‌లో నటించడం లేదు.. సుకుమార్‌‌‌కు రుణపడి ఉంటాను.. నవీన్

    2009 లో కృష్ణ వంశీ గారి దర్శకత్వం లో వచ్చిన శశిరేఖ పరిణయం తో పరిచయమై నాని హీరో గా నటించిన పిల్లా జమిందార్ చిత్రం లో హిజ్రా పాత్రతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని ప్రేక్షక హృదయంలో నిలిచిపోయా

    By Rajababu
    |

    సినిమా విజయానికి స్టార్ హీరోలే కాదు కమెడియన్లు కూడా చాల కీలక పాత్ర పోషిస్తున్నారు . 80 శతం చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలతో సహా కేవలం కామెడీ బాగుంటేనే చిత్రాలు విజయవంతం అవుతున్నాయి. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ , అలీ వంటి స్టార్ కమెడియన్లు చిత్రవిజయానికి ప్రధాన కారణం అవుతున్నారు. కొందరు కమెడియన్లు హీరోలు గా మరి విజయబాటలో నడుస్తున్నారు.

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలేకే కాదు కమెడియన్స్ కి కూడా చాల డిమాండ్ ఉంది పోటీ కూడా ఉంది. ఈ పోటీ పరిశ్రమలో ఎదుగుతున్నాడు నవీన్ నేని . 2009 లో కృష్ణ వంశీ గారి దర్శకత్వం లో వచ్చిన శశిరేఖ పరిణయం తో పరిచయమై నాని హీరో గా నటించిన పిల్లా జమిందార్ చిత్రం లో హిజ్రా పాత్రతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని ప్రేక్షక హృదయంలో నిలిచిపోయాడు. తర్వాత ఆటోనగర్ సూర్య, కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో, మళ్ళి మళ్ళి ఇది రానిరోజు , ద్వారకా, మనమంతా, నేనే రాజు నేనే మంత్రి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బిజీ కమెడియన్ అయ్యాడు.

    ఇటీవల విడుదల అయినా నేనే రాజు నేనే మంత్రి చిత్రం సూపర్ హిట్ కాగా, నవీన్ నేని చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చిన సందర్భంగా తన ఆనందాన్ని తెలుగు ఫిల్మీబీట్‌తో పంచుకున్నారు.

    మీ ఎక్కడ పుట్టారు , ఏమి చదువుకున్నారు ?

    మీ ఎక్కడ పుట్టారు , ఏమి చదువుకున్నారు ?

    నేను అమలాపురంలోని పుట్టి పెరిగానూ. హోటల్ మానేజ్ మెంట్ డిగ్రీ కోర్స్ చేశాను.

    చిత్రపరిశ్రమకి ఎలా వచ్చారు ?

    చిత్రపరిశ్రమకి ఎలా వచ్చారు ?

    చిన్నపటినుంచి సినిమాలు అంటే పిచ్చి. సినిమా చుసిన తర్వాత ఇంటికి వచ్చి స్నేహితులముందు అదే పాత్రని నటించేవాడిని. నా స్నేహితులు నా నటనని చూసి నన్ను సినిమాలోకి వెళ్ళమని ఎంకరేజ్ చేసేవాళ్ళు . నా స్నేహితులవల్లే నేను సినిమాలకి వచ్చాను.

    సినిమాల్లో అవకాశాల కోసం ఎలాంటి కష్టాలు పాడ్డారు?

    సినిమాల్లో అవకాశాల కోసం ఎలాంటి కష్టాలు పాడ్డారు?

    మొదటిలో నాకు హైదరాబాద్ లో ఎవరు తెలీదు. చాలా కష్టాలు పాడాను. డాన్స్ మాస్టర్ సుభాష్ గారి సహాయం తో కృష్ వంశి గారి శశిరేఖ పరిణయం సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. తర్వాత మళ్ళి అవకాశాలు కోసం రెండు ఏళ్ళు తిరిగాను. చాల సినిమాలో ఆడిషన్స్ ఇచ్చాను. చివరికి నా హిజ్రా నటన చూసి నాని గారు హీరో గా నటించిన పిల్లా జమిందార్ చిత్రం లో అవకాశం వచ్చింది . పిల్లా జమిందార్ చిత్రం నాకు చాల గుర్తింపు తెచ్చింది. తర్వాత హిజ్రా తరహా క్యారెక్టర్ అవకాశాలు చాలా వచ్చాయి. నచ్చిన పత్రాలు చేశాను . తర్వాత ఆటోనగర్ సూర్య సినిమాలో మంచి కామెడీ పాత్ర చేసే అవకాశం వచ్చింది.

    ఇటివల కాలంలో ఏ చిత్రాల్లో నటించారు?

    ఇటివల కాలంలో ఏ చిత్రాల్లో నటించారు?

    ఆటోనగర్ సూర్య లో కామెడీ తో పటు మంచి ఎమోషన్ ఉంటుంది నా పాత్రకి, రొటీన్ లవ్ స్టోరీ చిత్రం లో కామెడీ విలన్ గా చేశాను. కుమారి 21 ఎఫ్ లో చాలా బలమైన క్యారెక్టర్ చేశాను. నాకు ఆ చిత్రం చాల మంచి పేరు తెచ్చిపెటింది. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకులు సుకుమార్ గారికి రుణపడి ఉంటాను.

    మీరు జబర్దస్త్ లో ఎందుకు చేయడం లేదు ?

    మీరు జబర్దస్త్ లో ఎందుకు చేయడం లేదు ?

    నేను జబర్దస్త్ లో 28 ఎపిసోడ్స్ లో నటించాను. తర్వాత సినిమాలో వరుస అవకాశాలు రావటం తో బిజీ షెడ్యూల్ లో జబర్దస్త్ చేయటం కుదరలేదు.

    నేనే రాజు నేనే మంత్రి చిత్రం లో మీ క్యారెక్టర్ కి ఎలాంటి స్పందన వచ్చింది ?

    నేనే రాజు నేనే మంత్రి చిత్రం లో మీ క్యారెక్టర్ కి ఎలాంటి స్పందన వచ్చింది ?

    నేనే రాజు నేనే మంత్రి చిత్రం లో నాకు రెండు షేడ్స్ తో కూడిన పాత్ర దొరికింది. ఫస్ట్ హాఫ్ అంత కామెడీ పాత్ర ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ లో పూర్తీ భిన్నమైన పాత్ర చేశాను. నాకు చాలా మంచి పేరువచ్చింది. నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు తేజ గారికి మరియు హీరో రానా గారికి చాలా ధన్యవాదాలు.

     ప్రస్తుతం రాబోవు చిత్రాలు ఏమి చేస్తున్నారు?

    ప్రస్తుతం రాబోవు చిత్రాలు ఏమి చేస్తున్నారు?

    ప్రస్తుతం, రాంచరణ్ గారి రంగస్థలం చిత్రం లో ఒక కామెడీ పాత్రచేస్తున్నాను. సుకుమార్ గారు చాలా మంచి పాత్ర ఇచ్చారు. రామ్ చరణ్ గారితో ఇది నా మొదటి సినిమా. చిరంజీవి గారి సినిమాలు చూసి ఇండస్ట్రీ కి వచ్చాము ఇప్పుడు వారి కుమారుడైన రామ్ చరణ్ గారితో నటించటం చాల అదృష్టం. రంగస్థలంలో మంచి పాత్ర ఇచ్చిన సుకుమార్ గారికి హీరో రాంచరణ్ గారికి ధన్యవాదాలు.

    చాలామంది కమెడియన్లు కొని సినిమాలో హీరోగా కూడా చేసారు. మీకు అలాంటి అవకాశం ఏమైనా వచ్చిందా ?

    చాలామంది కమెడియన్లు కొని సినిమాలో హీరోగా కూడా చేసారు. మీకు అలాంటి అవకాశం ఏమైనా వచ్చిందా ?

    ప్రస్తుతానికి తమిళ దర్శకుడు నారాయణన్ దర్శకత్వం లో ఒక తెలుగు తమిళ చిత్రం చేస్తున్నాను. ఈ చిత్రం లో వేదం లాగ 4 కథలు ఉంటాయి. అందులో ఒక కథ లో హీరో గా నటిస్తున్నాను.

    English summary
    Naveen Nene is budding comedian in tollywood. He is grabing every opportunity with his talent. Recently he got special attention for Nene Raju Nene Mantri. In this occassion Naveen neni speaks to filmibeat telugu exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X