నా మాటలేవీ నమ్మకండి.. రివ్యూలు అలా.. జాతిరత్నాలుపై నవీన్ పొలిశెట్టి కామెంట్స్

జాతి రత్నాలు సినిమాపై మొదటి నుంచి అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. వైజయంతీ మూవీస్, స్వప్నా మూవీస్ నిర్మిస్తుండటం.. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి వారు కలిసి నటించడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. అలా జాతి రత్నాలు సినిమాపై అందరికీ ఓ మోస్తరు అంచనాలున్నాయి. పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నింటితో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

జాతిరత్నాలు రచ్చ..

జాతిరత్నాలు రచ్చ..

సోషల్ మీడియాలో జాతి రత్నాలు సినిమాపై ఏర్పడిన బజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాను, బుల్లితెరను, ప్రమోషన్స్‌ను అన్నింటిని జాతి రత్నాలు టీం బాగా వాడుకుంది. జనాల్లోకి జాతి రత్నాలు ఈజీగా వెళ్లేలా చేసింది.

ఆ పాటతో..

ఆ పాటతో..

ఇక జాతి రత్నాలు సినిమాపై ఇంతటి హైప్ ఏర్పడటానికి కారణం మాత్రం ఒక్క పాటే. చిట్టి నీ నవ్వంటే అనే పాటతో జాతి రత్నాలు అందరికీ ఎక్కేసింది. మరీ ముఖ్యంగా యూత్‌లో జాతి రత్నాలుపై మంచి క్రేజ్ ఏర్పడింది. అలా సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

నవీన్ పొలిశెట్టి రచ్చ..

నవీన్ పొలిశెట్టి రచ్చ..

ఇక సినిమా ప్రమోషన్స్‌లో నవీన్ పొలిశెట్టిదే కీలక పాత్ర. ప్రతీ ఒక్క షోకు, ఈవెంట్‌కు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేశాడు. మరీ ముఖ్యంగా బుల్లితెరపై పలు షోల్లో నవీన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొత్తానికి యూనిట్ పడ్డ కష్టానికి తగిన ఫలితమే వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని మొదటి ఆట నుంచే ప్రేక్షకులు తీర్పునిచ్చేశారు.

సక్సెస్ సెలెబ్రేషన్స్..

సక్సెస్ సెలెబ్రేషన్స్..

తాజాగా జాతి రత్నాలు టీం సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టీం మొత్తం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నవీన్ పొలిశెట్టి మీడియాతో మాట్లాడుతూ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ గురించి చెప్పుకొచ్చాడు.

నమ్మకండి...

నమ్మకండి...

మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే మా నిర్మాతలు ఈ సినిమాను ఏడాది పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చారు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్‌లు జరిగిపోవడంతో కాస్త భయం వేసింది. కానీ సినిమా వస్తోన్న రెస్పాన్స్ చూసి సంతోషం వేసింది. అయినా నా మాటలేవీ నమ్మకండి.. రివ్యూలో ఏం రాసినా నమ్మకండి.. మీరు దగ్గర్లోని థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి.. అసలు జాతి రత్నాలు సినిమాలో ఏముంది.. ఎందుకు జనాలు అంతగా నవ్వుతున్నారు.. ఎలా ఉందనేది మీరే చూడండి అని నవీన్ చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X