Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఖుషి సినిమా నుంచి మా స్టొరీ మొదలైంది.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై నవీన్ పొలిశెట్టి కామెంట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా ఇండస్ట్రీలో దాదాపు అన్ని వర్గాల వారు ఇష్టపడుతుంటారు. ఇక ఆయన ఇటీవల కోవిడ్ భారిన పడడంతో టాప్ స్టార్స్ నుంచి చిన్న తరహా నటీనటులు వరకు ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని స్పందించారు. ఇక జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి కూడా స్పందించాడు. తమ బంధం ఈనాటిది కాదు అంటూ తన అభిమానాన్ని బయటపెట్టాడు.
ప్రియాంక చోప్రా.. ఇంతకంటే హాట్ షో మరొకటి ఉండదేమో
పవన్ అభిమానిగా..
పవన్ కళ్యాణ్ ను సాధారణ జనాలు ఎంతలా ఇష్టపడతారో అదే తరహాలో నేటితరం యువ హీరోలు కూడా లైక్ చేస్తుంటారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేలా ఉంటారు. నితిన్, నిఖీల్ వంటి వారు కూడా పవర్ స్టార్ అభిమానులని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఆ లిస్ట్ లోకి మరో హీరో నవీన్ కూడా కూడా చేరిపోయాడు.
కోవిడ్ పాజిటివ్ రావడంతో
జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్నటివరకు అమెరికాలో సక్సెస్ టూర్ తో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ హీరో అక్కడే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
మా బంధం ఖుషి సినిమా నాటిది
వకీల్ సాబ్ లోని తెలంగాణ డైలాగ్ ను గుర్తు చేస్తూ.. అల్వాల్ నుండి 15 నిమిషాల్లో వచ్చినారా అమ్మా.. అనే మాడ్యులేషన్స్ తనకు ఎంతగానో నచ్చింది. బెస్ట్ వకీల్ సాబ్. సారి చిట్టి నువ్వు కూడా గుడ్ లాయర్. కానీ మా బంధం ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మొదలైంది.. మా ప్రార్థనలు మీతో ఉంటాయి సార్. త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నాను.. అని నవీన్ వివరణ ఇచ్చారు.
Recommended Video
అనుష్కతో న్యూ మూవీ..
ఇక నెక్స్ట్ నవీన్ పొలిశెట్టి అనుష్కతో మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అందులో 20ఏళ్ళ కుర్రాడిగా కనిపించబోతున్న నవీన్ 40ఏళ్ళ వయసులో ఉన్న అనుష్క పాత్రతో ప్రేమలో పడతాడట. ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కబోయే ఆ సినిమా తప్పకుండా వర్కౌట్ అవుతుందని నవీన్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.