ఇది నీ కోసమే సుశాంత్.. చూస్తున్నావాని తెలుసు: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ కామెంట్
గత ఎడాది కరోనా కష్ట కాలంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందడం అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లోనే కాకుండా మిగతా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ విషాదం ఎంతగానో కలచి వేసింది. అయితే సుశాంత్ కు సన్నిహితంగా ఉన్న వారిలో కొందరు ఇప్పుడు అతన్ని గుర్తు చేసుకుంటున్నారు. జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి కూడా సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ గా స్పందించాడు.
Recommended Video

నటుడిగానే కాకుండా
ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంతంగా ఎదిగిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఎమ్ఎస్.ధోని లాంటి బయోపిక్ చేసి తన టాలెంట్ ఏమిటో చూపించాడు. కేవలం నటుడిగానే కాకుండా మంచి మానవత్వపు విలువలున్న మంచి మనిషి కూడా. ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వెంటనే స్పందించి తనవంతు సహాయం చేసే వ్యక్తి.

నవీన్, సుశాంత్.. ఫ్రెండ్షిప్
ఇక నవీన్ పొలిశెట్టి కూడా ప్రస్తుతం అలాంటి తరహాలోనే మంచి నటుడిగా క్రేజ్ అందుకుంటున్నాడు. నవీన్, సుశాంత్ కు మంచి స్నేహం ఉంది. వీళ్ళిద్దరు కూడా చిచొరే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోవడమే కాకుండా కెరీర్ కు మరో బూస్ట్ అనే చెప్పాలి.

నేషనల్ అవార్డు..
చిచొరే సినిమా ద్వారా నవీన్ పొలిశెట్టికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కింది. అందులో యాసిడ్ అనే పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించి బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. అయితే రీసెంట్ గా సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో సుశాంత్ పేరుతో పాటు నవీన్ పొలిశెట్టి పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇది నీ కోసమే..
చిచొరే' ఉత్తమ హిందీ చిత్రం పురస్కారాన్ని గెలుచుకున్న సందర్భంగా నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. జాతిరత్నాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. నువ్వు చూస్తున్నావాని నాకు తెలుసు సుశాంత్. ఇది నీ కోసమే.. అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. దీంతో ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక సినిమా దర్శకుడికి అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి నవీన్ విషెస్ అంధించాడు.


Click it and Unblock the Notifications











