Jawan మూవీతో పోటినా? తప్పు చేస్తున్నావని భయపెట్టారు.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్‌పై నవీన్ పొలిశెట్
ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్, జాతిరత్నాలు సినిమా సక్సెస్ తర్వాత నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. అనుష్క శెట్టితో కలిసి నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. పీ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మూడో వారంలో భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ క్రమంలో తన సినిమా సక్సెస్ సాధించిన క్రమంలో నవీన్ పొలిశెట్టి మీడియాతో మాట్లాడుతూ..
జవాన్ సినిమా రిలీజ్‌తో భయం
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రిలీజ్ డేట్ నుంచి ఇప్పటి వరకు నేను ఎంజాయ్ చేయలేదు. ప్రమోషన్స్‌లో నవ్వుకుంటూ కనిపించాను కానీ జవాన్ సినిమాతో రిలీజ్ చేయడం వల్ల నాకు ఆ భయం వెంటాడింది. రిలీజ్‌కు ముందు రాత్రుళ్లు నిద్రపట్టలేదు. మూడేళ్లు కష్టపడి సినిమా చేశాం. కానీ సోలో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ ఎప్పుడైతే జవాన్ సినిమాతోపాటు ఈ సినిమా వస్తుందనగానే ఒక రకమైన భయం ఏర్పడింది. రిలీజ్ తర్వాత జవాన్‌తోపాటు మా సినిమాకు మంచి కలెక్షన్లు రావడం. తొలి మూడు రోజులకే 1 మిలియన్ డాలర్ కలెక్షన్లు రావడం చాలా హ్యాపీగా ఉంది అని నవీన్ పొలిశెట్టి అన్నారు.

సూపర్ హిట్ కావడంతో
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూడో వారంలో కూడా భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా మంచి ఆక్యుపెన్సీతో సినిమా నడుస్తున్నది. సినిమా రిలీజ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సిచ్యుయేషన్ బాగా లేదు. అయినప్పటికీ సినిమా పుంజుకొని బ్లాక్ బస్టర్ టాక్‌తో ముందుకు వెళ్తున్నది. మా సినిమా సూపర్ హిట్ అయినందుకు ఇప్పుడు చాలా హ్యాపీగా నవ్వుతున్నాను అని నవీన్ పొలిశెట్టి తెలిపారు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రిలీజ్‌కు ముందు
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రిలీజ్‌కు ముందు రకరకాలుగా భయపెట్టారు. జవాన్‌తో సినిమా వేయడం రాంగ్ డిసిషన్ అన్నారు. రాంగ్ రిలీజ్ డేట్ అంటూ భయపెట్టారు. నాకు కూడా భయం ఉంది. కానీ ప్రేక్షకులు స్పందించిన తీరు చాలా బాగుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో మూడో వారంలో స్క్రీన్ కౌంట్ పెంచారు. ఆడియెన్స్ నుంచి ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉంది అందుకే షోలు పెంచుతున్నారు. యూఎస్లో మూడో వారంలో 180 లొకేషన్స్‌లో స్క్రీన్స్ పెంచారు అని నవీన్ పొలిశెట్టి చెప్పారు.

25 రోజుల్లో 17 సిటీలలో
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కోసం నెల రోజులుగా ప్రమోషన్ చేస్తున్నాను. గత 25 రోజుల్లో 17 సిటీలు తిరిగాను. అమెరికాలో ఈస్ట్, వెస్ట్ కోస్ట్ అంతా తిరిగాను. విమానంలోనే నిద్రపోయాను. హోటల్‌కు రెస్ట్ తీసుకొనే అవకాశం లేకపోయింది. కానీ నేరుగా ప్రేక్షకులను కలిసిన తర్వాత నాలో ఉండే అలసట పోయి.. ఉత్సాహం, ఎనర్జీ పెరిగిపోయింది. సినిమా తీసిన తర్వాత ప్రమోషన్‌లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంటుంది అని నవీన్ పొలిశెట్టి చెప్పారు.

జాతిరత్నాలు సక్సెస్‌తో
నా జీవితంలో రకరకాల సక్సెస్ ఉన్నాయి. ఏఐబీలో వీడియోలు చేసినప్పుడు వచ్చిన సక్సెస్ వల్ల నాతో సినిమాలు తీయాలనే నిర్మాతలకు భరోసానిచ్చింది. ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ నిర్మాత నాపై పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడానికి వచ్చారు. ఏజెంట్ సినిమా సక్సెస్ తర్వాత జాతిరత్నాలు నిర్మాతకు మరో నమ్మకం కలిగించింది. కరోనా తర్వాత థియేటర్‌కు ప్రేక్షకులు వస్తారో రారో అనే సమయంలో జాతిరత్నాలు సినిమా సక్సెస్ కావడం నాపై నిర్మాతలకు మరింత నమ్మకం కలిగింది అని నవీన్ పొలిశెట్టి చెప్పారు.


Click it and Unblock the Notifications











