Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నవీన్ పొలిశెట్టి - అనుష్క శెట్టి న్యూ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. ఈ ఏడాది జాతిరత్నాలు సినిమాతో నవీన్ భారీ స్థాయిలో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనంతరం ఎలాంటి సినిమాతో వస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తో కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నో ఆఫర్స్ వచ్చినా..
నవీన్ పోలిశెట్టి ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిఫరెంట్ గా ఉండాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక అతనికి జాతిరత్నాలు సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ కేవలం తనకు నచ్చిన పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని అంతేకాకుండా సరికొత్త తరహాలో ఉండాలి అని చాలా నార్మల్ గా ఉన్న కథలను రిజెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది.
అనుష్కతో ఫిక్స్
ఇక నేడు నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన మంచి అప్ డేట్ అయితే ఇచ్చారు. అనుష్క శెట్టి తో నవీన్ సినిమా ఉంటుందని క్లారిటి ఇచ్చేశారు. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు గతంలో చాలానే వచ్చాయి. అంతేకాకుండా సినిమా స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడం వలన క్యాన్సిల్ అయింది అని కూడా చాలా కథనాలు వెలువడ్డాయి.
రొమాంటిక్ కామెడి..
అయితే నవీన్ పోలిశెట్టి ఆ ప్రాజెక్ట్ ఏ మాత్రం మిస్ ఇవ్వలేదు అని యు.వి.క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అనుష్క శెట్టి చేయబోయే తదుపరి సినిమాలో నవీన్ కూడా నటిస్తున్నట్లు అతని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ తరహాలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అనుష్క శెట్టి నాలుగు పదుల వయసులో ఉన్న మహిళగా కనిపిస్తుందట. ఇక ఆమె కంటే చిన్నవాడిగా నవీన్ ఆమె ప్రేమలో పడతాడు అని తెలుస్తోంది.
దర్శకుడు ఎవరంటే..
ఇక ఈ సినిమాకు రా రా కృష్ణయ్య దర్శకుడు మహేష్ దర్శకత్వం వహిస్తుండగా యు.వి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఎలాగైనా ఈ సినిమాతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలనే నవీన్ శెట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అనుష్క శెట్టి కూడా చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కాబట్టే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
బిజీగా నవీన్ పొలిశెట్టి..
సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే అనుష్క ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నవీన్ ఈ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమా తర్వాత అతనికి చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం టెంప్ట్ అవ్వలేదు. దిల్ రాజుతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే జాతిరత్నాలు సీక్వెల్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరి నవీన్ పోలిశెట్టి ఆ సినిమాలతో తన స్థాయిని ఏవిధంగా పెంచుకుంటాడో చూడాలి.