Naveen Polishetty: చేతులు మారిన నవీన్ పొలిశెట్టి సినిమా - క్రేజీ కాంబో మరోసారి హిట్టు కొట్టేనా?

Naveen Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హ్యాట్రిక్ కొట్టిన హీరో నవీన్ పొలిశెట్టి తర్వాత చిత్రం ఏదన్న దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గతేడాదే ప్రారంభమై కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న అనగనగా ఒక రాజు చిత్రం.. అనుకోని కారణాల వల్ల బ్రేక్ పడింది. ఇన్ని రోజులు ఈ సినిమాపై ఎవరూ ఫోకస్ కూడా చేయలేదు. అయితే ఈ ప్రాజెక్టును మొదట్లో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ లాక్ చేసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్టు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే కళ్యాణ్ శంకర్ చేతుల్లోంచి అనగనగా ఒక రాజు సినిమా జాతిరత్నాలు ఫేం అనుదీప్ చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం.

కళ్యాణ్ శంకర్.. అనగనగా ఒక రాజు సినిమాను లాక్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే అప్పటికే సితార బ్యానర్ పై నాగవంశీ మచి బడ్జెట్ తో మరో సినిమాకు అంతా సిద్ధం చేశారు. ఈక్రమంలోనే కళ్యాణ్ శంకర్ ను సంప్రదించి తన సినిమా చేయాలని చెప్పారు. అందుకే కళ్యాణ్ శంకర్ ఓకే చెప్పగా.. నాగవంశీ తన స్థానంలో సోదరి హారికను నిర్మాతగా పరిచయం చేస్తూ మ్యాడ్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా హిట్ దిశగా దూసుకుపోతుంది. కానీ పెండింగ్ లో పడ్డ నవీన్ పొలిశెట్టి సినిమా అలాగే ఉండిపోయింది.

Naveen Polishetty New Movie Anaganaga oka Raju Project go to Director Anudeep hands

ఈక్రమంలోనే ఈ కళ్యాణ్ శంకర్.. ఈ సినిమాను జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కు ఇచ్చినట్లు తాజా సమాచారం. జాతిరత్నాలు రైటింగ్ టీంలో కల్యాణ్ శంకర్ ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఎలాంటి మనస్పర్థలు, అపార్థాలు లేకుండా అనగనగా ఒక రాజు సినిమా చేతులు మారిపోయింది. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటికీ ప్రకటించకపోయినప్పటికీ... త్వరలోనే వెల్లడించబోతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఎప్పుడు ఈ విషయాన్ని చిత్రబృందం చెబుతుందో.

ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన క్యూట్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ప్రాజెక్టు అనుదీప్ చేతుల్లోకి రావడంతో.. హీరోయిన్ ను మారుస్తారా, ఆమెను ఉంచుతారా అనేది దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే తమన్ సంగీతం కొనసాగే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం. మరి చూడాలి. మరోసారి జాతిరత్నాలు క్రేజీ కాంబో కం బ్యాక్ ఇస్తుండగా.. ఇది ఏ రేంజ్ లో హిట్టవుతుందనేది.

Naveen Polishetty New Movie Anaganaga oka Raju Project go to Director Anudeep hands

ఇలా ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి సినిమాలు రావడం చాలా మామూలు విషయమే. ఎక్కువ సందర్భాల్లో కారణాలను బయటకి చప్పరు. కానీ కాంబోలు కుదరక, ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు ఇలా మారిపోతూ ఉంటుంది. గతంలో మిల్క్ బాయ్ మహేష్ నో చెప్పాకే సుకుమార్ పుష్ప సినిమాను తీసుకెళ్లి అల్లు అర్జున్ కు సెట్ చేశాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వద్దు అంటేనే.. కొరాటల శివ జూనియర్ ఎన్టీఆర్ దేవరకు రంగం సిద్ధం అయింది.

ఈ తరహాలోనే ఇప్పుడు నవీన్ పొలిశెట్టి సినిమా కూడా చేతులు మారింది. కళ్యాణ్ శంకర్ చేతుల్లోంచి అనుదీప్ చేతుల్లోకి మారిన ఈ చిత్రంపై పెద్ద అంతనాలే నెలకొన్నాయి. కానీ గ్యాప్ రాకుండా, త్వరగా పట్టాలెక్కిస్తే సినిమాకు మరింత బజ్ క్రియేట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X