''అనగనగా ఒకరాజు''గా నవీన్ పొలిశెట్టి.. కామెడీ జాతర షురూ అట!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ కుర్ర హీరో. ఆ తర్వాత 'జాతిరత్నాలు' అంటూ మరో సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ టీజర్ రిలీజయింది. ఆ వివరాల్లోకి వెళితే

మంచి సినిమాలు మాత్రమే
చిచ్చోరే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ యంగ్ హీరో ఇటీవల జాతిరత్నాలు సినిమా చేసి సూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ మీదున్నాడు. జాతిరత్నాలు సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అన్ని సినిమాలకు టెంప్ట్ కాకుండా మంచి సినిమాలు మాత్రమే ఎంచుకున్నారు.

ప్రొడక్షన్ నంబర్ 15గా
నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు కావడంతో అతని సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ హీరోయిన్ అనుష్కతో ఓ మూవీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తున్నట్టు మరో మూవీ అప్డేట్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్త నిర్మాణంలో ప్రొడక్షన్ నంబర్ 15గా ఓ చిత్రం రూపొందనుంది.

పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో
"అనగనగా ఒక రాజు" అనే టైటిల్ ను సినిమాకు ఫిక్స్ చేశారు. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాను 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.

అందరితో మాట్లాడుతూ
ఇక ఈ సినిమాకు టాలీవుడ్ సంచలన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ టీజర్ ను విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి పెళ్ళికొడుకు గెటప్ లో మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ ఆసక్తి రేకెత్తించారు. ఈ టైటిల్ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
త్రివిక్రమ్ కూడా పెట్టుబడి
అన్నట్టు ఈ సినిమాపై త్రివిక్రమ్ కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఇంతకీ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన శ్రీమతి సాయి సౌజన్య ఆయన భార్యనే. ఆయన భార్య పేరును నిర్మాతగా వేశారు. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











