»   » పవన్ కళ్యాణ్ మిస్ ఇండియాతో రొమాన్స్....?

పవన్ కళ్యాణ్ మిస్ ఇండియాతో రొమాన్స్....?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: 'పంజా' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మిస్ ఇండియా సారా జేన్ డియాస్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మిస్ ఇండియా బ్యూటీ పవర్ స్టార్ సరసన నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 2013-మిస్ ఇండియా విన్నర్ నవనీత్ కౌర్ దిలాన్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోయే గబ్బర్ సింగ్-2 చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

  సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం లాంచనంగా జరిగింది. త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్ల నుంది.

  Navneet Kaur Dhillon in Gabbar Singh 2?

  దీనికంటే ముందుగా పవన్ కళ్యాణ్ 'ఓ మై గాడ్' తెలుగు రీమేక్ షూటింగులో పాల్గొనబోతున్నారు. 'ఓ మై గాడ్' తెలుగు వెర్షన్‌కు 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. గతంలో 'జల్సా' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగానే 'దేవ దేవం భజే'చిత్రానికి కూడా మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇలా చేస్తే సెంటిమెంటు కలిసొస్తుందని, జల్సా మాదిరిగా ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు మహేష్ బాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

  తెలుగు నేటివిటికి తగినట్లు ఈచిత్రాన్ని మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని, దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు.

  'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

  English summary
  After releasing of Attarintiki Daredi, makers of Gabbar Singh 2 have been on hunt for female lead to share the screen presence with Pawan Kalyan. Although many names were contemplated by makers, no one was finalised. Now, one more name is added in this ever growing list of actresses for Gabbar Singh 2 and she is none other than Navneet Kaur Dhillon who was the winner of Femina Miss World India 2013.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more