twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గిన్నీస్ బుక్ లోకి సైతం నవనీత్ కౌర్ వివాహం

    By Srikanya
    |

    ఎమ్మెల్యే రవి రాణా ని నవనీత్‌కౌర్ అమరావతిలో నిన్న(బుధవారం)వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఈ వివాహం చాలా గ్రాండ్ గా ఎవరి ఊహకీ అందని విధంగా జరిగి మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది. వీరి వివాహంతో పాటు మొత్తం 3,611 జంటలు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. కార్యక్రమంలో ఒక్కటైనవారిలో హిందూ జంటలు 2,443, 739 బౌద్ధ జంటలు, 150 ముస్లిం జంటలు, 15 క్రైస్తవ జంటలు, 13 అంధ జంటలు ఇంకా శారీరక వికలాంగులు, గిరిజనులు ఉన్నారు.

    కార్యక్రమానికి హాజరైన విపరీతమైన రద్దీని అదుపుచేయడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. ఎమ్మెల్యే రవి రాణా ఏర్పాటుచేసిన ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో స్వయంగా ఆయనే పాల్గొని సినీనటి నవనీత్ కౌర్‌ను వివాహమాడి అందరికీ ఆదర్శంగా నిలిచారని అంతటా కొనియాడుతున్నారు. దేశ చరిత్రలోనేకాక ప్రపంచ చరిత్రలో ఇంతపెద్ద సంఖ్యలో సామూహిక వివాహాలు జరగడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమం ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కినట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను స్వామి రామ్‌దేవ్‌బాబాకు అందజేశారు.

    ఇక వరుడు ఎమ్మెల్యే రవిరాణా కోసం ప్రత్యేకంగా ఒక గురప్రు బగ్గీని తీర్చిదిద్దారు.అందులోనే ఆయన మైదానంలో ఏర్పాలుచేసిన భారీ వేదికపైకి చేరుకున్నారు. సతీమణి నవనీత్‌కౌర్‌తో కలిసి అక్కడ ఆసీనులైన ప్రముఖుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో అన్ని ధర్మాలకు చెందిన జంటలు పాల్గొనడంతో పురోహితులు అన్ని రకాల మంత్రాలు చదివారు. ప్రధాన వేదికకు 50 మీటర్ల దూరంలో చిన్న వేదిక ఏర్పాటు చేశారు. ర్యాంప్ మీదుగా నడిచి వెళుతున్న వధూవరులను ప్రముఖులందరు అభినందించి, ఆశీర్వదించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ 1,100 జంటలకు వంట సామగ్రిని అందజేశాడు.

    అలాగే ఎమ్మెల్యే రవి రాణా, నవనీత్‌కౌర్ దంపతుల డ్రెస్సు గురించి అంతటా హాట్ టాపిక్ గా మారింది. కుంకుమ రంగులో ఉన్న గాగ్రా చోలీతో వజ్రాలు పొదిగిన బంగారు నగలను ధరించి కల్యాణ మండపంలోకి అడుగుపెట్టిన నవనీత్ అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోనట్లుగా గోధుమరంగు జోధ్‌పురి సూట్‌లో కల్యాణ వేదికపైకి వచ్చిన రవిరాణా కూడా అందరినీ అలరించారు. బంగారు రంగు వన్నెకల దారాలతో అల్లిన ప్రత్యేకమైన తలపాగను ధరించి కార్యక్రమానికే ఆకర్షణగా నిలిచారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X