»   » ట్విట్టర్ రివ్యూ: మణిరత్నం ‘నవాబ్’పై ఆడియన్స్ రెస్పాన్స్ ఇలా....

ట్విట్టర్ రివ్యూ: మణిరత్నం ‘నవాబ్’పై ఆడియన్స్ రెస్పాన్స్ ఇలా....

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Nawab Movie Twitter Review నవాబ్ చిత్రం ట్విట్టర్ రివ్యూ

    ఇండియాలోని ది గ్రేట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. మేకింగ్ స్టైల్ విషయంలో, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే అంశంలో ఆయనకు ఎవరూ సాటిరారు. అందుకే ఆయన సినిమాలంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఎందరో. తాజాగా మణిరత్నం రూపొందించిన 'చెక్క చివంత వానమ్' అనే తమిళ చిత్రం తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అరవిందస్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక, లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    ఫస్ట్ ‌క్లాస్ ఫిల్మ్

    మణిరత్నం నుండి మరో ఫస్ట్ క్లాస్ ఫిల్మ్ వచ్చింది. మణిరత్నం కెరీర్లో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. స్టోరీ నేరేషన్ అద్భుతంగా ఉంది. ఫెంటాస్టిక్ షో.

    సాలిడ్ మూవీ

    ఓపెన్ మైండ్‌తో సినిమాకు వెళ్లండి. మీకు సాలిడ్ చిత్రం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇదొక స్క్రీన్ ప్లే రెవెల్యూషన్. సినిమాలోని ముఖ్య పాత్రల పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని చాలా చోట్ల స్టన్ అయ్యేలా చేస్తుంది.

    శింబు అభిమానులకు బిగ్ ట్రీట్

    ఈ మూవీ శింబు అభిమానులకు ట్రీట్ మాదిరిగా ఉంటుంది. మణిరత్నం, శింబు, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అదిరిపోయింది. అందరూ బాగా నటించారు.

    మణిరత్నం అదరగొట్టాడు

    స్టోరీ టెల్లింగ్ విషయంలో తాను మెగా మాస్టర్ అని మరోసారి మణిరత్నం నిరూపించారు. ఒక రివేంజ్ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించారు. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, నటీనటుల పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.

    మంచి మూవీ

    సినిమా మొత్తంలో విజయ్ సేతుపతి టాప్. రెహమాన్ మ్యూజిక్, సంతోష్ శివన్ సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. శింబు పెర్ఫార్మెన్స్ సూపర్. స్క్రీన్ ప్లే కాస్త లాగినట్లు ఉన్నా... ఓవరాల్‌గా గుడ్ మూవీ.

    ఆనంద భాష్పాలు

    మణిరత్నం ‘నవాబ్’ సినిమా చూసిన అనంతరం ఆనంద భాష్పాలు వచ్చాయంటూ ఓ అభిమాని ఉద్వేగానికి లోనయ్యారు.

    మణి సర్ ఈజ్ బ్యాక్

    ‘నవాబ్’ సినిమా చూసిన ఫ్యాన్స్ మణి సర్ ఈజ్ బ్యాక్ అంటూా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మణిరత్నం గత చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన నేపథ్యంలో ‘నవాబ్’ అద్భుతంగా ఉండటం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

    రమేష్ బాలా ఏమన్నారంటే...

    ప్రముఖ సౌత్ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ‘నవాబ్’ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని టాప్ యాక్షన్, గ్యాంస్టర్ సినిమాగా పేర్కొన్నారు. వింటేజ్ మణిరత్నం మేకింగ్ కనిపించింది. ఇదొక అద్భుతమైన సినిమా అంటూ పొగర్తలు గుప్పించారు.

    English summary
    The Great director Mani Ratnam is back with multi-starrer Nawab (Chekka Chivantha Vaanam), a gangster family drama. The stars Arvind Swami, Silambarasan, Arun Vijay and Vijay Sethupathi .Here, we bring you the live audience's reviews from twitter.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more