twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వు ముస్లిం.. "రాం లీలా" లో నటించొద్దు... సొంత గ్రామంలో స్టార్‌కు అవమానం

    |

    నిన్నా మొన్నటి వరకూ పాక్ నటీనటుల మీదనే తమ కోపం అంటూ వచ్చిన కొన్ని పార్టీలు ఇక నెమ్మదిగా భారత నటుల మీదా దృష్టి పెట్టాయి. ఇప్పుడు బాలీవుడ్ నటుడిని కేవలం ముస్లిం అన్న కారణం తో రామాయనం ఆధారం గా వేస్తున్న నాటకం లో వేశం వెయ్యటానికి వీలు లేదంటూ అడ్డుకున్నారు. అదీ ఏదో అనామక నటుడు కాదు అథను బాలీవుడ్ లో మంచి పేరున్న నవాజుద్దీన్ సిద్దిఖీ.

    నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన విలక్షణ నటనతో బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ. పిప్లీ లైవ్ మూవీతో తెరపైకి వచ్చిన ఈ యాక్టర్.... తక్కువ కాలంలో తానేంటో నిరూపించుకున్నాడు. విలనిజం పండించడంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఓన్ చేసుకున్నాడు నవాజుద్దీన్. స్వగ్రామం బదానా(ముజఫర్ నగర్ జిల్లాలో ఉందీఊరు)లో నవరాత్రుల సందర్భంగా ప్రదర్శించే రాంలీలా నటకంలో మారీచుడి పాత్ర ధరించాలనుకున్నాడు.

    బదానాలో రాంలీలా ప్రదర్శనకు గొప్ప పేరుంది. దాదాపు 100 ఏళ్ల నుంచి నవరాత్రుల సందర్భంగా అక్కడ ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. చిన్నప్పటి నుంచి దానిని చూస్తూ పెరిగిన నవాజుద్దీన్ ఏనాటికైనా నాటకంలో ఏదోఒక పాత్ర పోశించాలనుకున్నారు. పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన ఆయన.. నాటక నిర్వాహకులను కలిసి తనకో పాత్ర ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అలా గురువారం జరిగిన ప్రదర్శనలో ఆయనకు మారీచుడి వేషం దక్కింది. దీంతో స్టార్ నటుణ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

    అయితే ప్రదర్శన ప్రారంభానికి రెండు గంటల ముందు నాటకంలో నవాజుద్దీన్ నటించడంలేదంటూ నిర్వాహకులు ప్రకటించారు. శివసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రాంలీలాలో నటించకూడదని హెచ్చరించడమే ఇందుకు కారణమని తెలిసింది. 'నవాజుద్దీన్ సిద్దిఖీ అనే పేరు పెట్టుకుని రాంలీలాలో ఎలా నటిస్తావ్?'అని శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్షసాక్షలు తెలిపారు. వ్యతిరేకత నేపథ్యంలో సొంత ఊరి నుంచి ముంబై వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నవాజుద్దీన్.. 'గ్రామంలో ఉద్రిక్తత తలెత్తడం నాకు ఇష్టం లేదు. అందుకే నటించకూడదని నిర్ణయించుకున్నా'అని మీడియాకు చెప్పారు.

    English summary
    Nawajuddin Siddiqui was forced to pull out of the Ramlila because of opposition from local activists, allegedly of the Shiv Sena.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X