అమెరికాలో ‘నాయక్’ రికార్డ్... 100 స్క్రీన్లలో!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రూపొందిస్తున్న 'నాయక్' చిత్రాన్ని అమెరికా, కెనడాలలో భారీ ఎత్తున రికార్డు స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూనివర్శల్ మీడియా సంస్థ ఈచిత్రాన్ని ప్రణీత్ మీడియా సంస్థతో కలిసి...అక్కడ తొలిరోజు 100కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే విధంగా జనవరి 8న భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా అమెరికాలో ఈ రేంజిలో విడుదల కాలేదని యూఎస్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి రామ్ చరణ్ స్టార్ ఇమేజ్, వివి వినాయక్ సినిమాలపై ఉన్న క్రేజ్ వెరసి 'నాయక్' చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
తాజాగా విడుదలైన ట్రైలర్లో చిరంజీవి మాట్లాడుతూ...సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు వైవిధ్యం ఉందని, ఈ సినిమా తప్పకుండా అభిమానులకు పూర్తి స్థాయి సంతృప్తిని ఇస్తుందని వెల్లడించారు. డాన్సుల విషయంలో రామ్ చరణ్ తన గత సినిమాల కంటే ఈ సినిమాలో మరింత మెప్సిస్తాడని ఆయన చెప్పడం....సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











