రామ్ చరణ్ ‘నాయక్’ ఫస్ట్ లుక్ పోస్టర్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నాయక్' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విత్ లోగో పోస్టర్ ఈ రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి నాయక్ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9, 2013న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సంగీత దర్శకుడు తమన్ పాటలు కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు.
ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్ చేయనున్నారు. ''మాస్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్ చెప్పారు.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్, నిర్మాత : డివివి దానయ్య, దర్శకత్వం : వివి వినాయక్.


Click it and Unblock the Notifications











