‘నాయక్’ ఆడియో రిలీజ్ నెక్లెస్ రోడ్లో...
హైదరాబాద్: వివి వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం ఆడియో వేదిక మారింది. మొదట శిల్పకళా వేదికలో ఆడియో రిలీజ్ చేద్దామనుకున్న నిర్వాహకులు.... జనం భారీగా వచ్చే అవకాశం ఉండటంతో పెద్ద వేదిక కోసం అన్వేషణ సాగించారు. చివరగా ట్యాంక్ బండ్ పక్కన గల నెక్లెస్ రోడ్లో ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 15న ఆడియో విడుదల కానుంది. రామ్ చరణ్ గత సినిమా 'రచ్చ' ఆడియో కూడా ఇక్కడే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న తమన్ ఇటీవలే ఈచిత్రం రికార్డింగ్ ఫినిష్ చేసాడు. ఈచిత్రంలోని పాటల పాడిన వారిలో ప్రముఖ బాలీవుడ్ సింగర్లు శ్రేయ ఘోషల్, శంకర్ మహదేవన్ లాంటి వారు ఉన్నారు. ఇక ఈ నెల 15న విడుదల కానున్న చిత్ర ఆడియో విడుదల కోసమే తమన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్‌రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్


Click it and Unblock the Notifications











