రామ్ చరణ్ 'నాయక్‌'ఆడియో లాంచ్ వెన్యూ మార్పు

By Srikanya

హైదరాబాద్ రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్‌'. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో లాంచ్ మొదట అనుకున్నట్లు కాకుండా ఇప్పుడు నెక్లస్ రోడ్ లో భారీగా జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ 15న ఆడియో విడుదల జరుగుతుంది. తెలుగు సిని ప్రముఖలు ఈ ఆడియో లాంచ్ కు ప్రత్యేకంగా హాజరుకానున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ లాంచ్ లో పాల్గొనే అవకాసముందని వినపడుతోంది.

ఇక ఈ చిత్రం గురించి వివి వినాయిక్ మాట్లాడుతూ... నిత్యం నెత్తురు మండే యువకులే ఈ దేశానికి అవసరం... అన్నారు శ్రీశ్రీ. ఆ కుర్రాడు కూడా అచ్చం అలాగే ఉంటాడు. సరదాలూ, విలాసాలూ, వినోదాలూ అంటూ కాలాన్ని ఖాళీ చేయడం అతనికి ఇష్టం ఉండదు. లక్ష్యం తప్ప అతని కంటికి మరో వస్తువు కనిపించదు. తన ఒక్కడి కోసం కాదు.. తనని నమ్ముకొన్న అందరి కోసం ఓ పోరాటానికి సిద్ధమయ్యాడు. అదేమిటి? అందులో అతను విజయం సాధించాడా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు .

రామ్‌చరణ్‌ సరసన కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రధాన తారాగణంపై న్యాయస్థానానికి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరించారు. 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని రీమిక్స్‌ చేశారు. రామ్‌చరణ్‌, అమలాపాల్‌లపై ఈ గీతాన్ని తెరకెక్కించారు. తమన్‌ సంగీతం అందించారు. జనవరి 9న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X