‘నాయక్’ ఆడియో నేడే... ట్రాక్ లిస్ట్ ఇదే
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'నాయక్'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ నేడు గ్రాండ్ జరుగబోతోంది. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో ఇందుకు వేదిక కానుంది. మెగా స్టార్ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరువుతున్నరు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతి కానుకగా ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ ఈచిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి.
ఆడియో ట్రాక్ లిస్ట్ ఇదే...
1. నేనంటే అంతా...
2. దేవుడైనా ప్రేమకి...
3. నాయక్ టైటిల్ సాంగ్
4. ప్రపంచంలో...
5. చిన్నా పెద్దా..
6. శుభలేఖ రాసుకున్నా(రీమిక్స్)
ఈ చిత్రంలో సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్ తన శైలిలో మాస్, యాక్షన్ అంశాల్ని మేళవించారు. స్టార్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై విడుదలపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం నైజాం రైట్స్ పదకొండు కోట్లకు అమ్ముడై కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
'మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











