‘నాయక్’ఆడియో విడుదల తేదీ,వెన్యూ
హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం నాయక్ ఆడియో విడుదల తేదీ,వెన్యూ ఖరారయ్యాయి. డిసెంబర్ 14న ఆడియోని సినీ ప్రముఖుల సమక్షంలో మెగా బ్రదర్శ్ హాజరైన పంక్షన్ లో విడుదల చేస్తారు. అలాగే ఈ ఆడియో విడుదలకు వెన్యూగా శిల్ప కళా వేదిక ని ఎంపిక చేసారు. రామ్ చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్, అమలా పాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత.
ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ ''కథకి అనుగుణంగానే నాయక్ అనే పేరు ఖరారు చేశాం. రామ్ చరణ్ పాత్ర తీరుతెన్నులు ఆయన నటించిన గత చిత్రాలకంటే భిన్నంగా ఉంటాయి..ఇది యాక్షన్ ఎంటర్టైనర్. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది'' అన్నారు. ''అటు మాస్‌నీ ఇటు యువతనీ ఆకట్టుకొనే కథ ఇది'' అన్నారు చిత్ర సమర్పకుడు సూర్యదేవర రాధాకృష్ణ.
నిర్మాత డి.వివి దానయ్య మాట్లాడుతూ... 'ఈ కథకు 'నాయక్' అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. పక్కా మాస్ అంశాలతో పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటే అద్భుతమైన కథను ఆకుల శివ అందించారు. ఈ సినిమాకు సంభాషణలు కూడా శివే అందించడం విశేషం. తమన్ సంగీతం, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా అన్నారు.
అలాగే 'మగధీర' తర్వాత రామ్ చరణ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. అమలా పాల్ పాత్ర కూడా కథలో కీలకమైందే. రామ్ చరణ్ పాత్ర తీరుతెన్నులు ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. ఇప్పటివరకూ కనపించని కొత్త చరణ్ ఈ సినిమాలో కనిపిస్తాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











