రామ్ చరణ్ ‘నాయక్’ ఆడియో రిలీజ్ వాయిదా?
హైదరాబాద్ : వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం 'నాయక్'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో కాజల్, అమలా పాల్ హీరోయిన్ గా చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతి కానుకగా జవవరి 9, 2013న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఆడియో నవంబర్ 25న విడుదలవుతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం నాయక్ ఆడియో డిసెంబర్ 14కు వాయిదా వేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఏర్పాట్లు పూర్తి కానందునే ఆడియోను వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోందని, పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరయ్యేలా ఈ ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. నేనంటే అంతా....
2. దేవుడైనా ప్రేమకి...
3. నాయక్ టైటిల్ సాంగ్
4. ప్రపంచంలో...
5. చిన్నా పెద్దా..
6. శుభలేఖ రాసుకున్నా(రీమిక్స్)


Click it and Unblock the Notifications











