గందరగోళంగా ‘నాయక్’ ఆడియో రిలీజ్!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాప్ దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నాయక్' చిత్రం ఆడియో విషయంలో ఎన్నడూ లేని విధంగా గంధరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆడియో విడుదల తేదీని మార్చారు. ఇటీవల దర్శకుడు వివి వినాయక్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ఆడియోను ఈ నెల 14, శిల్పకళా వేదికలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో కానీ... తాజాగా మరోసారి ఆడియో విడుదలను వాయిదా వేసారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం 'నాయక్' ఆడియో ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసారు. ఆడియో వేదిక కూడా నానక్ రాంగూడలోని సినీ విలేజ్ కి మార్చారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. చిరంజీవి డేట్స్, సెక్యూరిటీ రీజన్స్ వల్లనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ఆడియో కంపోజింగ్ తో పాటు పాటల రీ రికార్డింగ్ కూడా పూర్తి చేసాడు. కొన్ని ప్రోమో సాంగులు కూడా విడుదల చేసారు. ఈ చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ అందించానని చెబుతున్న తమన్... ఆడియో విడుదల కార్యక్రమం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

యూనివర్సల్‌ మీడియా సంస్థ 'నాయక్‌' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X