రామ్ చరణ్ ‘నాయక్’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్: వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం 'నాయక్'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో కాజల్, అమలాపాల్ హీరోయిన్ గా చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతి కానుకగా జవవరి 9, 2013న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం ఆడియో డిసెంబర్లో విడుల కానుంది. తమన్ ఈచిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. తాజాగా అందుకు సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్ట్ బయటకు లీకైంది. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. నేనంటే అంతా....
2. దేవుడైనా ప్రేమకి...
3. నాయక్ టైటిల్ సాంగ్
4. ప్రపంచంలో...
5. చిన్నా పెద్దా..
6. శుభలేఖ రాసుకున్నా(రీమిక్స్)
ఈ చిత్రంలో సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా చరణ్ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్ శైలిలో మాస్, యాక్షన్ అంశాల్ని మేళవించారు. రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











