twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లో SVSC కంటే ‘నాయక్’ పై చేయి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీసు బరిలో పోటా పోటీగా దూకుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం కాగా, మరొకటి మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమా రికార్డులు, కలెక్షన్ల పరంగా పై చేయి సాధిస్తుంది అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    తెలుగు సినిమాలకు మెయిన్ ఇన్‌కం సోర్స్ నైజాం ఏరియా. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఇక్కడ పోటీ పోటీగా ఎక్కువ థియేటర్లు దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. అయితే ఫైనల్‌గా 'నాయక్' చిత్రానికే ఎక్కువ థియేటర్లు దక్కాయి.

    హైదరాబాద్ వ్యాప్తంగా నాయక్ చిత్రానికి తొలి రోజు 110 స్క్రీన్లు దక్కినట్లు తెలుస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి కేవలం 70 నుంచి 80 మధ్య మాత్ర థియేటర్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాలను నైజా ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. నాయక్ చిత్రానికి దిల్ రాజు కేవలం డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. కానీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి స్వయంగా నిర్మాత. ఈనేపథ్యంలో దిల్ రాజు సవతి ప్రేమ చూపెట్టి తన సొంత సినిమాను ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది.

    కానీ..... కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి ప్రభావమో? లేక చరణ్ మేనమామ అల్లు అరవింద్ రంగంలోకి దూకి పావులు కదపడమో? తెలియదు కానీ, మొత్తానికి 'నాయక్' చిత్రం హైదరాబాద్ ఏరియాలో అత్యధిక థియేటర్లు దక్కించుకుంది. హైదరాబాద్ ఏరియాలో థియేటర్లు ఎక్కవగా దక్కాయంటే ఆ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

    English summary
    Mega Power Star Ram Charan's 'Nayak' and Victory Venkatesh and Super Star Mahesh Babu's 'Seethamma Vaakitlo Sirimalle Chettu' are releasing on 9th and 11th of January respectively. We have already reported that 'Nayak' is expected to release in 110 screens in Hyderabad city and it is going to be an all time record for any Telugu movie so far. On the other hand, 'SVSC's release has been confirmed in 58 theaters in the first chart. On the day of release, the release theaters may be extended to 70+ in number.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X