రామ్ చరణ్ ‘నాయక్’ ఆడియో ఎప్పుడంటే..?
హైదరాబాద్ : రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'నాయక్ ' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ . ఈచిత్రానికి సంబంధించిన విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. తాజాగా అందిన సమాచారం ఈ చిత్రం ఆడియో డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే 4 పాటలు పూర్తి చేసాడు. బ్యాలెన్స్ 2 పాటలు అక్టోబర్ కల్లా కంప్లీట్ చేయనున్నాడు.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం జిలేబీ పాత్రలో నవ్వులు పండించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు
ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్ చేయనున్నారు. ''మాస్ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. చరణ్ పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. 'ఠాగూర్' తరహాలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నాం. తమన్ బాణీలు హుషారుగా సాగిపోతాయ''ని ఇటీవల ఓ సందర్భంలో వినాయక్ చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదకు వస్తుంది. సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు.
రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే కసి రామ్ చరణ్‌లో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











