‘నాయక్’ ఆడియో వేదిక (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'నాయక్' ఆడియో వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో ఆడియో వేడుకకు సంబంధించిన వేదిక రెడీ అయింది. ఈ ఆడియో వేడుకకు భారీగా అభిమానులు తరలివస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసారు. సాయంత్రం 7 గంటలకు ఫంక్షన్ ప్రారంభం కానుంది.

లోనికి ఎంటరయ్యే ద్వారం దగ్గర నుండి స్టేజీ వరకు మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్, దర్శకుడు వివి వినాయక్ ఫోటోలతో కూడిన భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేసారు. స్టేజీపై ఒకేసారి దాదాపు 50 మంది నిలబడినా తట్టుకోగలిగేలా తయారు చేసారు. అదే విధంగా కళాకారులు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు వీలుగా విశాలంగా తయారు చేసారు.

మెగా స్టార్ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరువుతున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్రమంత్రిగా ఉండటంతో భద్రత ఏర్పాట్లు కూడా ఏమాత్రం తీసుపోకుండా ఏర్పాటు చేసారు. చిరంజీవితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.

‘నాయక్’ ఆడియో వేదిక (ఫోటోలు)

నాయక్ ఆడియో ఫంక్షన్ వేదిక ఇదే..

‘నాయక్’ ఆడియో వేదిక (ఫోటోలు)

దారి పొడవునా ఏర్పాటు చేసిన ప్లెక్సీలు

‘నాయక్’ ఆడియో వేదిక (ఫోటోలు)

నాయక్ మూవీలో రామ్ చరణ్, కాజల్ అదిరిపోయే స్టెప్స్ వేస్తూ...

‘నాయక్’ ఆడియో వేదిక (ఫోటోలు)

నాయక్ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ అనడానికి ఈ ప్లెక్సీనే నిదర్శనం.

‘నాయక్’ ఆడియో వేదిక (ఫోటోలు)

వివి వినాయక్, రామ్ చరణ్ బారీ సైజ్ ప్లెక్సీలు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X