twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంఘ విద్రోహ శక్తులపై రామ్ చరణ్ పోరాటం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో డివివి దానయ్య నిర్మాతగా యూనివర్సల్‌ మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'నాయక్‌'.

    'నాయక్' చిత్రంలోలో రామ్ చరణ్ సంఘ విద్రోహ శక్తులపై పోరాటం చేసే పాత్రలో కనిపించనున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందే ఈచిత్రం స్క్రిప్టు, కథ మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం 'నాయక్' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ సినిమాకు సంబంధించిన కీలకమైన ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

    'నాయక్' ఇటు అభిమానులకు అటు సిని ప్రేమికులకు కన్నుల పండుగ కానుంది.ఈ చిత్రంలో పలు అందమయిన ప్రదేశాలను మరింత అందంగా కెమెరాలో బంధించి చూపించనున్నారు. రామ్ చరణ్ మరియు అమల పాల్ మీద తెరకెక్కించిన 'శుభలేఖ రాసుకున్న' పాటను తొలిసారిగా స్లోవేనియాలో చిత్రీకరించారు. స్లోవేనియాలో చిత్రీకరించబడిన తొలి భారతీయ చిత్రం 'నాయక్' ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ కి మాత్రమే మన చిత్రాలు పరిమితమయ్యాయి.

    ఆ సంగతి పక్కన పెడితే ఈచిత్రం స్టోరీ లీకైనట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాయక్ చిత్రంలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్‌గా ఇద్దరుంటారట, రామ్ ఏమో మాస్, చెర్రి ఏమో క్లాస్ ఇలా ఇద్దరుంటారట. రామ్ ఎప్పుడు గొడవలతో కొందరిని చంపుతుండగా రామ్ చేసిన హత్యలకు చెర్రీను పోలీసులు అరెస్ట్ చేస్తారట ఇది ఇంటర్వల్‌లో ట్విస్ట్ .. ఈ కేసులో చెర్రీను కోర్టులో ప్రవేశపెట్టి వాదోపవాదాలు విన్న తరువాత చెర్రీకు జడ్జీ శిక్ష విధిస్తుండగా రామ్ ఏంట్రీ ఇస్తాడట. ఇక్కడో ట్విస్ట్. రామ్ తనే ఈ హత్యలన్నీ చేశానని ఈ హత్యలతో చెర్రీకు ఏ సంబంధం లేదని ఒప్పుకుని లొంగిపోతాడట. ఇక సెకండాఫ్‌లో రామ్ ఆ హత్యలు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరిస్తారిన అంటున్నారు.

    మొత్తం మీదన నాయక్‌ చిత్రం మెగా అభిమానులు మెచ్చే పూర్తి కమర్షియల్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందని, చాలా కాలంగా సరైన హిట్ లేని వినాయక్ ఈచిత్రంతో బంపర్ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. సంక్రాంతి తర్వాత అంటే జనవరి చివరి వరాంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈచిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కెమెరా: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినాయక్‌.

    English summary
    Mega power star Ram Charan will be wagging a lone battle against anti-social elements in his next film Nayak. The film is currently being shot in Ramoji Film City where the unit is filming action sequences. Kajal Agarwal and Amala Paul are playing female leads. VV Vinayak director of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X